ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన అర్జున బెరడు (Arjun Bark Water) గుండె ఆరోగ్యానికి ఒక దివ్యౌషధంగా పరిగణిస్తారు. ఈ బెరడులో ఉండే టానిన్‌లు, ఫ్లేవనాయిడ్‌లు, ట్రైటెర్పెనాయిడ్ సపోనిన్‌లు వంటి సమ్మేళనాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు అర్జున బెరడు నీటిని తాగడం వల్ల గుండెపోటు, అధిక రక్తపోటు వంటి సమస్యలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నీరు గుండెకు రక్షణ కవచంలా పనిచేసి, గుండె ధమనాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
Piracy : దారుణం..ఆన్లైన్ లో HD ప్రింట్ తో కూలీ , వార్ 2 చిత్రాలు
అర్జున బెరడు నీరు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ధమనులలో అడ్డుకట్టలు ఏర్పడకుండా నిరోధించి, గుండెను బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా, ఇందులో ఉండే పొటాషియం, టానిన్‌లు రక్తపోటును నియంత్రించి, పక్షవాతం (స్ట్రోక్) ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ నీరు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో కూడా తోడ్పడుతుంది. మధుమేహం ఉన్నవారికి కూడా ఇది మేలు చేస్తుంది. ఇందులో ఉండే సహజ సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
అర్జున బెరడు నీరు కేవలం గుండె సమస్యలకే కాదు, ఇతర అనారోగ్యాలకు కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలను బలోపేతం చేసి, కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా ఈ నీటిని తాగడం వల్ల వృద్ధాప్య ఛాయలను కూడా అరికట్టవచ్చు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అందువల్ల, రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు అర్జున బెరడు నీరు తాగడం అలవాటు చేసుకుంటే అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ, ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు వైద్యుడి సలహా తీసుకోవడం తప్పనిసరి.