Beard Tips : గడ్డం రాలేదని దిగులు చెందుతున్నారా… ఈ నూనె అప్లై చేస్తే చాలు.. గడ్డం ఒత్తుగా పెరగాల్సిందే?

కొంతమందికి న్యాచురల్ గా గడ్డం (Beard) పెరిగితే మరి కొంతమందికి అసలు గడ్డం రాక రకరకాల ఆయిల్స్ ట్రీట్మెంట్లను కూడా చేయించుకుంటూ ఉంటారు.

  • Written By:
  • Updated On - December 7, 2023 / 06:05 PM IST

Thick Beard Growth Tips : ఈ రోజుల్లో గడ్డం పెంచుకోవడం అన్నది ఫ్యాషన్ అయిపోయింది. కొంతమంది పురుషులు కావాలనే గడ్డానికి వివిధ స్టైల్ లో చేయించుకుంటూ ఉంటారు. అయితే కొంతమందికి న్యాచురల్ గా గడ్డం (Beard) పెరిగితే మరి కొంతమందికి అసలు గడ్డం రాక రకరకాల ఆయిల్స్ ట్రీట్మెంట్లను కూడా చేయించుకుంటూ ఉంటారు. అయితే మీరు కూడా గడ్డం రాలేదని బాధపడుతున్నారా? అయితే ఇకపై దిగులు చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ ఆయిల్ ని ఉపయోగించడం వల్ల గడ్డం (Beard) ఒత్తుగా పెరగడం ఖాయం. మరి ఎలాంటి ఆయిల్ ఉపయోగిస్తే గడ్డం (Beard) పెరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

అలోవేరా జెల్‌ని గడ్డానికి అప్లై చేస్తుండండి. దీని వల్ల చర్మం హైడ్రేట్ అవుతుంది. ఈ కారణంగా గడ్డం ఒత్తుగా పెరుగుతుంది. రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గడంతో పాటు గడ్డం కూడా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే జుట్టు సమస్యల్ని దూరం చేయడంలో భృంగరాజ్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం బృంగరాజ్ ని నూనెలో వేసి బాగా వేడి చేసి చల్లార్చి ఆ నూనెతో గడ్డం ప్రాంతంలో మసాజ్ చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల గడ్డం ఒత్తుగా బాగా పెరుగుతుంది. ఉసిరి కాయలు తిన్నా, ఈ జ్యూస్ తాగినా కూడా జుట్టు సమస్యలు దూరమవుతాయి. అదే విధంగా గడ్డం కూడా ఒత్తుగా పెరుగుతుంది. దీనిని రెగ్యులర్‌గా చేస్తుండాలి.

రోజ్మేరీ ఆయిల్ కూడా గడ్డం పెరగడానికి బాగా హెల్ఫ్ చేస్తుంది. దీని వల్ల రక్తప్రసరణ పెరిగి గడ్డం పెరుగుతుంది. టీట్రీ ఆయిల్‌లానే ఈ ఆయిల్‌ని కూడా వాడాలి. గడ్డం ఒత్తుగా పెరగడానికి టీట్రీ ఆయిల్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. దీనిని మనం మనం వాడే షాంపూలో వేసి దాంతో గడ్డాన్ని క్లీన్ చేయచ్చు. లేదా ఏదైనా ఆయిల్‌లో వేసి ఆ ఆయిల్‌‌తో మసాజ్ చేయవచ్చు.

Also Read:  Heart Attack: 51 ఏళ్ల మహిళకు 16 నెలల్లో 5 సార్లు గుండెపోటు..!