Site icon HashtagU Telugu

Turmeric: ముఖానికి పసుపు పూసుకుంటున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

Turmeric

Turmeric

పసుపు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఎలాంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా పసుపు తప్పనిసరిగా ఉండాల్సిందే. అలాగే పసుపును స్త్రీలు చర్మ సౌందర్యం కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మార్కెట్ లో పసుపు తయారు చేసిన ఎన్నో రకాల బ్యూటీ ప్రాడక్టులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలామంది స్త్రీలు స్నానం చేసేటప్పుడు పసుపును ముఖానికి అప్లై చేసి ఆ తర్వాత స్నానం చేస్తూ ఉంటారు. అయితే ఇలా ముఖానికి పసుపును అప్లై చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయట. అందుకే దీన్ని చర్మంపై నేరుగా ఉపయోగించకూడదట. ఎందుకంటే ఇది చికాకు, దురద, దద్దుర్లను కలిగిస్తుందని చెబుతున్నారు. చాలా మంది పసుపును నేరుగా చర్మానికి అప్లై చేస్తారు. కానీ పసుపును ఇలా వాడటం వల్ల మచ్చలు అవుతాయట. అందుకే పసుపులో ఏదో ఒకటి మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలని చెబుతున్నారు. అంతే కాకుండా పసుపు వేడిగా ఉంటుంది. దీన్ని నేరుగా ముఖానికి అప్లై చేస్తే ముఖంపై దద్దుర్లు వస్తాయట. అలాగే దురద పెడుతుందట. చర్మం ఎర్రగా మారుతుందట. అందుకే పాలు, తేనె, పెరుగు, శనగపిండి, పిండి, కలబంద జెల్ మొదలైన వాటిలో ఏదో ఒకటి పసుపులో కలిపి వాడాలని చెబుతున్నారు. అయితే పసుపును ముఖానికి రోజూ అప్లై చేయకూడదట.

ఎందుకంటే పసుపులో వేడి చేసే గుణం ఉంటుందట. మీరు రోజూ ముఖానికి పసుపును రాస్తే మొటిమలు అవుతాయట. వారానికి ఒకటి నుంచి రెండు సార్లు పసుపును ముఖానికి అప్లై చేయవచ్చని చెబుతున్నారు. పసుపులో బ్లీచింగ్ గుణాలు ఉంటాయట. ప్రతిరోజూ ముఖానికి పసుపు రాసుకుంటే ముఖం పసుపు రంగులోకి మారుతుందని చెబుతున్నారు. పసుపులో వేడి చేసే గుణం ఉంటుంది. అందుకే పసుపును చిటికెడు మాత్రమే ఉపయోగించాలట. చాలా మంది పసుపును ఒక టీస్పూన్ లేదా అంతకంటే ఎక్కువ కలిపి ఫేస్ ప్యాక్స్ మొదలైన వాటిలో ఉపయోగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ముఖంపై మంట, దురద సమస్యలు వస్తాయట. పసుపు వర్ణద్రవ్యాలు చర్మంపై పేరుకుపోతాయట. మీరు రోజూ పసుపును ఉపయోగిస్తే మీ చర్మం పూర్తిగా పసుపు రంగులో కనిపిస్తుందని చెబుతున్నారు.