Purse Tips : పాత పర్స్ ని ఎక్కువ రోజులు ఉపయోగిస్తున్నారా..? అయితే ఆర్థిక నష్టాలు రావడం ఖాయం..

చాలా కాలం పాటు వాడుతున్న పర్సు (Old Purse) కచ్చితంగా ఏదో ఒక రోజు పాడైపోతుంది. అలా పాడైన పర్సును వాడడం చాలా అశుభం అని శాస్త్రం చెబుతోంది.

  • Written By:
  • Publish Date - December 22, 2023 / 07:20 PM IST

Using Old Purse for a Long Time? : మామూలుగా మనం జీవితంలో చేసే చిన్న చిన్న పొరపాట్లే మనం ఎదుర్కొనే ఆర్థిక సమస్యలకు మానసిక సమస్యలకు కారణమవుతాయి. అందుకే పెద్దలు తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా వాస్తు పరమైన పొరపాట్లు చేయడం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మనం వాడే వాలెట్ లేదా పర్సు (Purse) విషయంలో కొన్ని రకాల పొరపాట్లు అస్సలు చేయకూడదు. మరి పర్సు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

చాలా కాలం పాటు వాడుతున్న పర్సు (Old Purse) కచ్చితంగా ఏదో ఒక రోజు పాడైపోతుంది. అలా పాడైన పర్సును వాడడం చాలా అశుభం అని శాస్త్రం చెబుతోంది. కొంతమంది కొన్ని ఏళ్ల నుంచి ఒకటే పర్సన్ వాడుతూ చిరిగిపోయిన కూడా అలాగే దానిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. చిరిగిన పర్సు వాడడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షానికి నోచుకోని వ్యక్తి కష్టాల పాలు కాక తప్పదు. పర్సు దాని ఆకృతి మార్చుకునే విధంగా చాలా నిండుగా నింపి ఉంచకూడదు. వేస్ట్ పేపర్స్ ఎప్పుడూ పర్సులో పెట్టకూడదు. ఒకవేళ పెట్టినా వీలైనంత తొందరగా వాటిని తీసేయాలి. ఈ నియమం పాటించకపోతే పర్సులో డబ్బు నిలవదు. శాస్త్రాన్ని అనుసరించి కొత్తగా మెరిసిపోతున్న పర్సును పాకెట్ లో ధరించాలి. అయితే కొందరు చాలా కాలంగా వాడుతున్న పర్సుతో ఒక రకమైన సెంటిమెంట్ కలిగి ఉంటారు.

అలాంటపుడు పర్సు పడేసేందుకు మనసు అంగీకరించదు. అలాంటపుడు పాత పర్సు విషయంలో కొన్ని చక్కని చిట్కాలు పాటిస్తే సరి.
మీకు మీ పాత పర్సుతో మీకు సెంటిమెంటల్ బాండ్ ఉందని అనిపిస్తే, దాన్ని పడెయ్యడం ఇష్టం లేకపోతే పాత పర్సులో ఉన్న ముఖ్యమైన కాగితాలు, కార్డ్స్ డబ్బు కొత్త పర్సులోకి మార్చుకోవాలి. ఇక పాత పర్సులో ఒక రూపాయి నాణాన్ని ఎర్రని వస్త్రంలో చుట్టి ఉంచాలి. ఇది చాలా శుభప్రదమైన పరిహారం. లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ నిలిచి ఉంటుంది. పాత పర్సు చాలా లక్కీ అని మీరు భావిస్తే దాన్ని పడెయ్యకూడదు. అలాగని దాన్ని వాడడం కూడా అంత మంచిది కాదు. కానీ పాత పర్సును ఎప్పుడూ ఖాళీగా కూడా ఉంచకూడదు. ఎరుపు రంగు వస్త్రంలో కొన్ని బియ్యం గింజలు మూటగా కట్టి దాన్ని పాతపర్సులో కొంత కాలం పాటు పెట్టుకోవాలి. తర్వాత ఆ చిన్న మూటను కొత్త పర్సులో పెట్టుకోవాలి. వాస్తు ప్రకారం ఇలా చెయ్యడం వల్ల పాత పర్సులోని పాజిటివిటి కొత్త పర్సులో చేరే అవకాశం ఏర్పడుతుంది. పాత పర్సు ఎర్రని అక్షతల మూటతో పాటు కొన్నాళ్లు వినియోగించుకోవచ్చు. కానీ పూర్తిగా చిరిగిపోయిన పర్సును మాత్రం వినియోగించకూడదు.

Also Read:  Bread Gulab Jamun: బ్రెడ్ గులాబ్ జామూన్ ఇలా చేస్తే చాలు.. ఒక్క పీస్ కూడా మిగలదు?