Acne Scars : మొటిమలు, మచ్చలు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే?

మొటిమలు వాటి తాలూకా మచ్చలు (Acne Scars) పోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Written By:
  • Publish Date - December 9, 2023 / 07:40 PM IST

Acne Scars : ఈ రోజుల్లో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అందం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగించడం వల్ల అప్పుడప్పుడు మనకు పింపుల్స్ లాంటివి వస్తూ ఉంటాయి. అలాగే స్కిన్ పై దుమ్ము ధూళి వంటివి పేరు కోవడం వల్ల కూడా మనకు మొటిమలు వస్తూ ఉంటాయి. అయితే చాలామంది మొటిమలు రాగానే వెంటనే వాటిని గోటితో గిల్లుతూ ఉంటారు. అలా చేయడం వల్ల అవి మారడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. కాబట్టి మొటిమలను గోటితో గిల్లకూడదు. అవి సహజంగా ఎలా వచ్చాయో వాటిని అలాగే పోయేలా చేసుకోవాలి. అయితే మొటిమలు ఉన్నవారు మంచినీటితో తరచుగా ముఖం కడుక్కుంటూ ఉండాలి.

ముఖాన్ని తరచూ శుభ్రం చేసుకోవడం వల్ల ముఖంపై ఉన్న దుమ్ము ధూళి ఎప్పటికప్పుడు క్లీన్ అవుతూ ఉంటాయి. ఇలా చేయడంతో పాటు కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల మొటిమల సమస్యలకు పెట్టవచ్చు. అయితే మొటిమలు రావడంతో పాటు వాటి తాలూకా మచ్చలు (Acne Scars) కొన్ని కొన్ని సార్లు అలాగే ఉంటాయి. మొటిమలు వాటి తాలూకా మచ్చలు (Acne Scars) పోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

ఎక్కువగా స్వీట్స్ తీసుకోవడం వంటివి మానేయాలి. ఎందుకంటే స్వీట్స్ లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా మొటిమలు వస్తూ ఉంటాయి. ఇక మేకప్ కూడా ఒక భాగంగానే పనిచేస్తుంది. మరి మొటిమలు పోవాలంటే అందుకోసం ముందుగా ఒకే బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ శెనగపిండి, కొంచెం పసుపు, అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దాంట్లో కొంచెం రోజు వాటర్ కూడా వేసి కలిపి ముఖానికి వేసుకొని ఐదు నిమిషాల ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన రాత్రికి రాత్రి మీ మొటిమలు మచ్చలు మాయం. అదేవిధంగా ఒక స్పూన్ బియ్యప్పిండిలో ఒక స్పూన్ పెరుగు వేసి బాగా కలిపి దాన్ని కూడా మచ్చలపై అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లని నీటితో శుభ్రం చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. మీ ముఖం పై ఉన్న మొటిమలు వాటి మచ్చలు రాత్రికి రాత్రే తగ్గిపోతాయి. ఈ విధంగా ఈ రెమెడీలను తరచూ ఫాలో అవుతూ ఉండడం వల్ల మొటిమలు మచ్చల సమస్యల నుంచి బయటపడవచ్చు.

Also Read:  Health Benefits: కాలీఫ్లవర్ ఆకులు,వేర్ల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?