Site icon HashtagU Telugu

Threading: ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేస్తున్నారా.. అయితే ఈ షాకింగ్ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Threading

Threading

అమ్మాయిలు కను బొమ్మల విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కనుబొమ్మలు అందంగా ఉండాలి అని ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అందులో భాగంగానే కనుబొమ్మలు ఎక్కువగా పెరిగినప్పుడు అంద విహీనంగా కనిపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు చాలామంది బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఐబ్రోస్ త్రెడ్డింగ్ చేయించుకుంటూ ఉంటారు. ఇంకొందరు ఇంటిపట్టునే ఉంటూ వాటిని చేసుకుంటూ ఉంటారు. అయితే కనుబొమ్మలను థ్రెడ్డింగ్ చేయించడం అనర్ధాలకు దారి తీస్తుందని చెబుతున్నారు. కనుబొమ్మలను థ్రెడ్డింగ్ చేయించడం వల్ల కళ్లపై ఉన్న సున్నితమైన చర్మానికి చిరాకు కలుగుతుందట.

కొంతమందిలో కనుబొమ్మల వద్ద ఎర్రగా మారుతుందని, అసౌకర్యం కలుగుతుందని చెబుతున్నారు. కాగా కనుబొమ్మ ప్రాంతం చుట్టూ సున్నితమైన చర్మం ఉండడం వల్ల కనుబొమ్మలను షేప్ చేసేవారు సరిగ్గా చేయకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందట. చర్మం రంగు మారే సమస్య కూడా రావచ్చట. అంతేకాదు అన్నిటికంటే ముఖ్యంగా ఐబ్రోస్ చేయించుకుంటే జ్ఞాపకశక్తి బాగా తగ్గుతుందని, ఎక్కువగా దేనిని గుర్తు పెట్టుకోలేని పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. అలాగే కొందరిలో ఐబ్రోస్ చేయించుకున్న తర్వాత వాపు వచ్చే సమస్య కూడా ఉంది. సహజంగా ఐబ్రోస్ చేయడానికి ఉపయోగించేది దారమే కాబట్టి, ఇందులో రసాయనాలు వాడకం ఉండకపోయినప్పటికీ కొంతమందిలో ఇది అలర్జీలను కలిగిస్తుందట.

ఐబ్రోస్ చేస్తున్న సమయంలో సాధారణంగా నొప్పి వస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా ఐబ్రోస్ చేయడం వల్ల కనుబొమ్మల చుట్టూ ఉండే స్కిన్ పోర్స్ తెరుచుకుంటాయట. దీనివల్లనే అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందట. ఆ ఇన్ఫెక్షన్ మొటిమలుగా మారే అవకాశం కూడా ఉంటుందని, ఇక స్కిన్ పోర్స్ మూసుకోవడానికి ఏదైనా లోషన్ కానీ రోజ్ వాటర్ కానీ అప్లై చేయాలట. ఐబ్రోస్ చేయడానికి ఉపయోగించే దారం మురికిగా ఉన్న దారాన్ని ఉపయోగించకూడదట. ఎందుకు అంటే ఐబ్రోస్ చేసే వ్యక్తి శుభ్రంగా చేతులు కడుక్కొని దానిని ఉపయోగించాలని అలా చేస్తే ఎటువంటి అలర్జీలు రావట.