Site icon HashtagU Telugu

Phone Usage : ఫోన్ లో గంటల కొద్దీ మాట్లాడుతున్నారా.. అయితే ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే?

Are You Talking On The Phone For Hours... But Do You Really Need To Know This..

Are You Talking On The Phone For Hours... But Do You Really Need To Know This..

ప్రస్తుత జనరేషన్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ లకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కువ శాతం స్మార్ట్ ఫోన్ (Phone)ల తోనే గడుపుతూ ఉంటారు. ఒక పూట అన్నం లేకపోయినా ఉంటారేమో కానీ స్మార్ట్ ఫోన్ ని వినియోగించకుండా అసలు ఉండలేరు. కొందరు గంటలకు ఫోన్లో (Phone) తరచూ మాట్లాడుతూనే ఉంటారు. కొందరు గంటల కొద్ది మొబైల్ ఫోన్ ని అలాగే వినియోగిస్తూనే ఉంటారు. అయితే ఎక్కువగా మొబైల్ ని ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది కాదు అని వైద్యులు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా అలాగే ఉపయోగిస్తూ ఉంటారు.అయితే మీరు కూడా అతిగా ఫోన్ (Phone) ఉపయోగించడం, ఎక్కువగా ఫోన్ మాట్లాడుతున్నారా అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..

We’re Now on WhatsApp. Click to Join.

మొబైల్ ఫోన్లు (Phone) తక్కువ స్థాయిలో రేడియో ఫ్రీక్వెన్సీ శక్తీని విడుదల చేస్తూ ఉంటాయి. వీటిని అధికంగా వాడుతున్న కొద్ది అనారోగ్య సమస్యలు వస్తాయి. సెల్ ఫోను వారానికి అరగంట కంటే ఎక్కువ సేపు వాడితే అధిక రక్తపోటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పలువురి అకాల మరణాలకు హైబీపీ కారణం అని చెబుతున్నారు వైద్యులు. ఎక్కువసేపు ఫోన్ మాట్లాడితే హై బీపీ శాతం పెరుగుతుందన్న విషయాన్ని గుర్తించారు.

ఈ విషయంపై అనేక పరిశోధనలు కూడా జరిపారు. వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కవ సేపు ఫోన్‌లో మాట్లాడితే అధిక రక్తపోటు ముప్పు సుమారు 12 శాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సెల్ ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడ‌డం వ‌ల్ల మొటిమ‌లు, అల‌ర్జీలు, చ‌ర్మం పై ముడ‌త‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు, క‌ళ్ల కింద న‌ల్ల‌టి వ‌ల‌యాలు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ట‌. ఫోన్లో గంటల తరబడి తరబడి అలాగే చెవిలో పెట్టుకొని మాట్లాడటం వల్ల చెవికి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. వినికిడి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతాయి అంటున్నారు వైద్యులు. ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావం కూడా అంత మంచిది కాదు అంటున్నారు.

Also Read:  Whatsapp: యూజర్స్ కి షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఒకేసారి అన్ని లక్షలు అకౌంట్స్ బ్యాన్?