Site icon HashtagU Telugu

Kidney Stone Problem: మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే?

Mixcollage 12 Dec 2023 05 59 Pm 1746

Mixcollage 12 Dec 2023 05 59 Pm 1746

ప్రస్తుత రోజుల్లో ప్రతి 10 మందిలో నలుగురు కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యని మొదట్లోనే గుర్తించక ముదిరిపోయి అనేక రకాల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే కిడ్నీలో రాళ్ల సమస్య ఏర్పడడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. అటువంటి వాటిలో మన ఆహార పదార్థాలు జీవన శైలి కూడా ఒకటి. అయితే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు కూరగాయలను బాగా తీసుకోవడం వల్ల అవి ఆ సమస్యను దూరం చేస్తాయి. కూరగాయలలో ముఖ్యంగా మునగకాయలతో మంచి ఉపయోగాలు ఉన్నాయి. మునక్కాడ ముక్కలు అంటే సాంబార్ లో ఎక్కువగా వేస్తూ ఉంటారు.

అలాగే టమాటాతో కూడ కూర వండుతూ ఉంటారు. కొందరు ములక్కాడ వేపుడు చేసుకొని తింటూ ఉంటారు. మునగ జీర్ణ సంబంధిత ఇబ్బందులు తగ్గిపోతే ఎముకలను దృఢంగా మార్చుతాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచడం చాలా ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మునగ ఆకుతో చేసిన కూర తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతాయి. డయాబెటిస్ సమస్యలు ఉన్నవాళ్లకి కూడా ఈ మునగాకులు చాలా సహాయ పడతాయి. దీని ఆకులు యాంటీ డయాబెటిక్ ,యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

ఉదర సంబంధిత ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఈ మునగ ఆకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని తీసుకోవడం వలన మలబద్ధకం లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లు తప్పకుండా ఈ మునగ ఆకులను తీసుకోవాలని చెప్తున్నారు. దీనిలో పోషకలు చాలా ఉన్నాయి. ఇది మీ రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే తప్పనిసరిగా మునగ ఆకులను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కిడ్నీలో రాళ్లను కరిగించి మూత్రం ద్వారా బయటికి వెళ్లేందుకు ఉపయోగపడుతున్నాయి. మునగ ఆకుల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇది గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారికి ఎంతో సహాయపడుతుంది.