Tips for Cracked Feet : మామూలుగా చాలా మందికి సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్ లలో ఆ కాళ్ల పగుల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా శీతాకాలంలో పాదాల పగుళ్ళ సమస్యను చాలా ఎక్కువగా ఉంటుంది. తేమ పొడిగాలులు సరిగా లేకపోవడం పాదాలకు సంబంధించి జాగ్రత్తలు సరిగా వహించకపోవడం వలన పాదాల పగుళ్లు (Cracked Feet) వస్తూ ఉంటాయి. అయితే ఈ పాదాల పగుళ్లు (Cracked Feet) సమస్యను తగ్గించుకోవడానికి వంటింటి చిట్కాలను ఉపయోగించడంతో పాటు రకరకాల బ్యూటీ ప్రోడక్ట్ లని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇందుకోసం కొన్ని రకాల మొక్కలను ఉపయోగిస్తే చాలా మంచిది అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ మొక్కలు ఏవి ఆ మొక్కలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
గోరింటాకు, కరివేపాకు రెండు కూడా పాదాల పగుళ్లును (Cracked Feet) తగ్గించడానికి చాలా గొప్పగా పనిచేస్తాయి. ఈ రెండు రకాల మొక్కలు మనకు ఇంటి పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉంటాయి. పెరుగుతున్న వయసు, గట్టి నేల మీద ఎక్కువ సేపు నిలబడడం థైరాయిడ్, మధుమేహం లాంటి సమస్యలు ఎక్కువగా కారణమవుతున్నాయి. ఈ పాదాల పగలు సమస్యలు అధికమవుతున్నాయి. చాలామంది సమస్యను పెద్దగా పట్టించుకోరు. తర్వాత సమస్య తీవ్రమై నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. గోరింటాకు ఆకులను కరివేపాకు ఆకులను సమానంగా తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తాజా ఆకులు అయితే దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కరివేపాకు, గోరింటాకు ఆకులను మెత్తని పేస్టులా పట్టుకోవాలి.
ఈ పేస్టులో మర్రిపాలను కలిపి పాదాల పగుళ్లకు అప్లై చేసుకోవాలి. ఈ మిశ్రమం రాత్రి పడుకునే సమయంలో అప్లై చేసి మరుసటి ఉదయం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారం రోజులు పాటు చేస్తే మృదువుగా మారుతాయి. కరివేపాకులో ఉండే విటమిన్స్ పాదాల పగుళ్లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే గోరింటాకు లో ఉండే పోషకాలు కూడా బాగా అంది పాదాల పగుళ్లు ఉన్న ప్లేస్ లో కొత్త కణాలు అభివృద్ధికి సహాయ పడుతుంది. కాబట్టి ఈ రెండిటిని కలిపి మిశ్రమంలో తయారు చేసుకొని నిత్యం వారం రోజులపాటు రాస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
Also Read: Aloo Bonda: చలికాలం వేడివేడిగా ఏదైనా తినాలని ఉందా.. అయితే ఆలు బోండాలు ట్రై చేయాల్సిందే?