Site icon HashtagU Telugu

Financial Problem Tips : ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా..? అయితే ఇలా చేస్తే చాలు.. అదృష్టం పట్టి పీడీంచడం ఖాయం..

Are You Struggling With Financial Problems.. But If You Do This, You Are Sure To Get Lucky.

Are You Struggling With Financial Problems.. But If You Do This, You Are Sure To Get Lucky.

Tips to overcome from Financial Problems : ఈ రోజుల్లో ఆర్థిక సమస్యలు లేని వారిని వేళల్లో లెక్కపెట్టవచ్చు. ఎందుకంటే ప్రతి 10 మందిలో తొమ్మిది మంది ఆర్థిక సమస్యలతో (Financial Problems) సతమతమవుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బు చేతిలో మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇక ఆర్థిక సమస్యల (Financial Problems) నుంచి బయట పడటం కోసం ఎన్నో రకాల పరిహారాలను నియమాలను పాటిస్తూ ఉంటారు. అయినా కూడా ఫలితం లభించక బాధపడుతూ ఉంటారు. మరి ఆర్థిక సమస్యల (Financial Problems) నుంచి బయట పడాలంటే ఏం చేయాలో అందుకు ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

అయితే ప్రతీ రోజు ఇంటి ఇల్లాలు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర శుభ్రం చేసి రాగి పాత్రతో నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకుంటే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ప్రతిరోజు ఇంటి ఇల్లాలు ఈ విధంగా చేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుంది. అటువంటి ఇంట్లోకి పేదరికం కూడా ఎప్పుడు రాదు. అయితే బుధవారాన్ని లక్ష్మీ ఆగమన దినంగా భావిస్తారు. అందుకే బుధవారం రోజున ఎటువంటి చెల్లింపులు చెయ్యకూడ్దు. అప్పు చెల్లించడం లేదా అప్పు ఇవ్వడం వంటివి అస్సలు చెయ్యకూడదు. ఈ రోజున చేసే ఖర్చు డబ్బు రాకకు ఆటంకం కలిగిస్తుంది. అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె కరుణ కటాక్షాలకు పాత్రులు కావచ్చు. కాబట్టి అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీదేవి ఆరాదన చెయ్యాలి.

గురువారం రోజు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో ధనలాభం జరిగితే అందులో కొంత భాగం దానం చెయ్యడం వల్ల ఇంట్లో లక్ష్మీ దేవి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అప్పు చెల్లించాల్సి ఉంటే మంగళ వారం రోజున అప్పుతిరిగి చెల్లించడం మొదలు పెట్టండి త్వరలోనే ఆ అప్పు తీరిపోతుంది. అలాగే ఉదయం ఇంటిని శుభ్రం చెయ్యకుండా బ్రేక్ ఫాస్ట్ చెయ్యకూడదు. ఎంత ఉదయాన్నే బయటకు వెళ్లాల్సి వచ్చినా సరే ఇంటిని శుభ్రం చెయ్యకుండా తాళం వేసి బయటకు వెళ్ళ కూడదు. అలాగే ప్రతి శనివారం ఇంట్లోని చెత్తను శుభ్రం చేసుకోవాలి. పనికి రాని వస్తువులను బయట పడెయ్యాలి..ఇంటి సింహ ద్వారాన్ని ద్వార లక్ష్మిగా బావిస్తారు. కనుక గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పడెయ్యడం, గడప మీద కాలు పెట్టి ఇంట్లోకి రావడం, గడపకు అటూ ఇటూ చెరో కాలు వేసి నిలబడడం చెయ్యకూడదు. ఇది ద్వార లక్ష్మిని అవమాన పరచినట్టవుతుంది. పసుపు కుంకుమలు ఉన్న గడపలు లక్ష్మిదేవికి ఆహ్వానం పలుకుతాయని శాస్త్రం చెబుతోంది. చిల్లర నాణెలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసే వారికి లక్ష్మీ అనుగ్రహం ఎన్నటికీ లభించదు. కనుక వీటి విషయంలో నిర్లక్ష్యం కూడదు. చిల్లర డబ్బులను జాగ్రత్త చెసుకోవాలి. పువ్వులను కూడా దారిలో పడెయ్యడం చెయ్యకూడదు. తినగలిగేంత మాత్రమే అన్నం వండుకోవాలి. ఎక్కువగా అన్నం వడ్డించుకుని పారేస్తే అన్నపూర్ణాదేవిని అవమానించినట్టే అవుతుంది. కాబట్టి ప్రతిరోజు మనం చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లను సరి చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది.

Also Read:  Online Shopping : ఆన్‌ లైన్‌ షాపింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. జీమెయిల్‌ లో సరికొత్త ఫీచర్స్ మీకోసమే..