ప్రేమ (Love) అనేది జీవితంలో గొప్ప అనుభూతి. అయితే అది ఒక్కోసారి నిరాశను కూడా మిగిల్చే పరిస్థితుల్ని కలిగించవచ్చు. అనేక ప్రేమకథలు మధ్యలోనే ముగిసిపోతాయి. ఈ విడిపోనికి కారణాలు ఎన్నో ఉండొచ్చు . కులం, మతం, ఆస్తి, హోదా, లేదా పరస్పర అహం. అయితే జీవితాంతం తోడుండాలన్న ఆశతో ప్రేమలో పడిన వారు, ఒక్కసారిగా విడిపోవాల్సి వస్తే ఎదురయ్యే బాధను మాటల్లో వివరించడం కష్టం. బ్రేకప్ తర్వాత ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, ఒంటరితనం, మానసిక కుంగింపు వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ బాధ నుంచి బయట పడటానికి మొదటిగా చేయాల్సిందేమిటంటే..మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడం. గతాన్ని పదే పదే గుర్తుచేసుకుంటూ కూర్చోవడం కాకుండా, జిమ్, డ్యాన్స్, పుస్తకాలు చదవడం వంటి మీకు నచ్చిన హాబీల్లోకి దృష్టి మళ్లించాలి. అలాగే ట్రిప్ లు కూడా మంచి మార్గం. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఒక మంచి ప్రదేశానికి వెళ్లడం ద్వారా కొత్త ఎనర్జీ వస్తుంది. ఇంటివాళ్లతో ఎక్కువ టైమ్ గడిపితే, మనసు రిలాక్స్ అవుతుంది.
Operation Sindoor : ఆ ఒక్క ఫోన్ కాలే..పాక్ తో యుద్ధం ఆపేలా చేసింది – అమిత్ షా
దీనితో పాటు బ్రేకప్ తర్వాత కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడం చాలా అవసరం. కొంతమంది మద్యం, ధూమపానం వంటి నష్టమిచ్చే అలవాట్లకు అలవాటుపడతారు. ఈ దశలో మంచి మిత్రుల సహాయం తీసుకోవడం, మీను మీరు తక్కువగా భావించకుండా, గతం కోసం మానసికంగా తల్లడిల్లకుండా ఉండటం అవసరం. “రిలేషన్ బ్రేక్ కావడానికి నేనే కారణం” అనే ఆలోచనను విడిచిపెట్టి, భవిష్యత్తు కోసం మరిన్ని అద్భుతమైన అవకాశాలను ఎదురుచూస్తూ ముందుకు సాగాలి.
ఎక్స్ లవర్ నంబర్, ఫోటోలు వంటి జ్ఞాపకాలను తొలగించడమూ చాలా ముఖ్యం. గతం జ్ఞాపకాలతో కాలం గడిపితే బ్రేకప్ బాధ ఇంకా తీవ్రంగా మారుతుంది. మీ ఫోన్లోనూ, సోషల్ మీడియాలోనూ ఎక్స్ లవర్ గురించి ఉన్నదల్లా రిమూవ్ చేయడం వల్ల మనసు కాస్త హాయిగా మారుతుంది. అప్పుడు మీరు త్వరగా కోలుకుని, కొత్త జీవితం వైపు అడుగులు వేయగలరు. ప్రేమలో విఫలమయ్యాం అనుకోవద్దు, అది ఒక్క అధ్యాయమే. జీవితంలో ఇంకా ఎన్నో అందమైన పేజీలు మిగిలే ఉన్నాయి.