Tips: ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారా.. ఈ జాగ్రత్తలు మస్ట్

  • Written By:
  • Updated On - March 15, 2024 / 10:26 PM IST

Tips: పరీక్షల ఒత్తిడి తగ్గాలంటే పిల్లలు చదివేటప్పుడు విశ్రాంతి, విరామం తీసుకోవాలి. చదువులో మరింత మెరుగ్గా ఉండాలన్నా, చదివేది బాగా అర్థం కావాలన్నామైండ్ ను రిలాక్స్ గా ఉంచుకోవడం ఎంతో అవసరం. రోజూ కనీసం 20 నిమిషాల రెగ్యులర్ మెడిటేషన్ చేయడం వల్ల ఏకాగ్రత పెంపొందించుకోవడం సులువు అవుతుంది. ఇది మానసిక ప్రశాంతతను కాపాడుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వాల్ నట్లు, పండ్లు,ఒమేగా సమృద్దిగా ఉండే ఆహారాలు, కూరగాయలు జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతాయి. అదే విధంగా దైవభక్తి , ప్రార్థన కూడా మానసిక ఆరోగ్యం పెచుతుంది. మానసిక ఆరోగ్యం బాగుండాలన్నా, ఒత్తిడి తగ్గాలన్నా సరైన నిద్ర చాలా అవసరం.అలసిపోయిన మెదడుకు విశ్రాంతిని, ఓదార్పును ఇవ్వడంలో నిద్ర చాలా సహాయపడుతుంది. విద్యార్థులకు ఏయే అనుమానాలు అడిగి ముందే తెలుసుకొని క్లారిఫై చేయాలి.