International Trips : ఈ ఇయర్ ఎండింగ్‌కి ఓ ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? టూరిజం సీజన్ మొదలయ్యే ఈ సమయాల్లో ఎక్కువ మంది విదేశీ యాత్రల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే భారీ ఖర్చులతో కాకుండా తక్కువ బడ్జెట్‌తో, వీసా ఫ్రీ లేదా ఈ-వీసా సదుపాయాలతో వెళ్లే డెస్టినేషన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి ప్రయాణాలు adventurous అయినప్పటికీ స్మార్ట్ ప్లానింగ్‌తో సాగిస్తే, అనుభూతి మరింత మెరుగ్గా ఉంటుంది. మీ బడ్జెట్‌కు తగ్గట్లుగా, ఇక్కడ కొన్ని దేశాలు, వాటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుందాం.
1. భూటాన్
భారతీయ పౌరులకు వీసా అవసరం లేదు. హిమాలయ పర్వతాల మద్యలో ఉన్న ఈ చిన్న దేశం ప్రశాంతమైన వాతావరణం, బౌద్ధ సంప్రదాయాలకు కేంద్రంగా నిలుస్తుంది.
ట్రిప్ బడ్జెట్: రూ.40,000 వరకు (6 రోజులు)
రోజువారీ ఖర్చు: రూ.1500–2000
ప్రదేశాలు: పారో, టైగర్‌స్ నెస్ట్, థింపూ
2. మలేషియా
ఆధునికత, ప్రకృతి అందాలు కలిపిన దేశం.
విమాన చార్జ్: రౌండ్ ట్రిప్‌కు రూ.16,000
ఈ-వీసా అవసరం
రోజు ఖర్చు: రూ.1500–2500
చూడదగ్గ ప్రదేశాలు: కోలాలంపూర్, లాంగ్‌కవీ, పీనాన్గ్
3. జార్జియా
యూరోపియన్ టచ్‌తో ఆసియాలోని అందమైన దేశం.
విమాన చార్జ్: రూ.30,000
ఈ-వీసా అవసరం
రోజు ఖర్చు: రూ.1500–2500
ప్రదేశాలు: టిబిల్సి, కావ్కాసస్ మౌంటెన్స్, యూరోపియన్ ఆర్కిటెక్చర్
4. కంబోడియా
ప్రాచీన నాగరికతల సమ్మేళనం.
విమాన చార్జ్: రూ.26,000
వీసా ఆన్ అరైవల్
రోజు ఖర్చు: రూ.1500–2000
చూడదగ్గ ప్రదేశాలు: ఆంగ్‌కోర్ వాట్ టెంపుల్స్, ఫ్నోమ్ పెన్హ్, సిహానుక్విల్లే
5. లావోస్
శాంతమైన జీవన విధానంతో ఆకర్షించే దేశం.
విమాన చార్జ్: రూ.25,000
వీసా ఆన్ అరైవల్
రోజు ఖర్చు: రూ.1500–2000
ప్రదేశాలు: లాంగ్ ప్రాబాంగ్, వాంగ్ వియాంగ్, వాటర్‌ఫాల్స్
6. నేపాల్
భారతీయులకి అత్యంత సులభమైన ట్రిప్.
వీసా అవసరం లేదు
విమాన టికెట్: రూ.12,000–18,000 (ఢిల్లీ నుంచి)
రోజు ఖర్చు: రూ.1500–2000
ప్రదేశాలు: కాట్మాండు, పోఖరా, హిమాలయన్ ట్రెక్స్
7. ఒమన్
మధ్యప్రాచ్యంలో బడ్జెట్ ఫ్రెండ్లీ డెస్టినేషన్.
వీసా ఖర్చు: రూ.2100 (ఈ-వీసా)
విమాన టికెట్: రూ.10,000–13,000
రోజు ఖర్చు: రూ.2500–3500
ప్రదేశాలు: మస్కట్, నిజ్వా, వాది షాబ్, వాది టివి
8. శ్రీలంక
సాంస్కృతికంగా మనదేశంతో కలసిపోయే బీచ్ ప్యారడైజ్.
విమాన టికెట్: రూ.14,000–15,000
రోజు ఖర్చు: రూ.2000–3000
ప్రదేశాలు: బెంటోటా బీచెస్, మిరిస్సా, నువారా ఎలియా
9. థాయిలాండ్
బీచ్లు, షాపింగ్, టెంపుల్స్‌తో యూత్ ఫేవరెట్.
వీసా అవసరం
విమాన చార్జ్: రూ.20,000
రోజు ఖర్చు: రూ.2000–3000
చూడదగ్గ ప్రదేశాలు: బ్యాంకాక్, చియాన్ మై, ఫుకెట్
10. వియత్నాం
సంస్కృతి, ప్రకృతి, చరిత్రతో కలసిన అందమైన దేశం.
వీసా: ఈ-వీసా అవసరం
విమాన టికెట్: రూ.25,000
రోజు ఖర్చు: రూ.1000–2000
ప్రదేశాలు: హానోయ్, హో చి మిన్ సిటీ, హోయ్ ఆన్
ట్రిప్ ప్లాన్ చేసే ముందు తెలుసుకోవలసిన విషయాలు:
.ప్రతి దేశానికి సంబంధించిన వీసా ప్రక్రియ, కరెన్సీ మార్పిడి, భాష మరియు స్థానిక చట్టాలపై అవగాహన ఉండాలి.
.భద్రతా సూచనలు, వాతావరణ పరిస్థితులు తెలుసుకుని వెళ్లాలి.
.బయలుదేరేముందుట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది.
.ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్రణాళిక వేసుకుంటే, ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది ఖర్చు కాకుండా జీవితాంతం గుర్తుండిపోయే అనుభవంగా మిగిలిపోతుంది.