Site icon HashtagU Telugu

Home : ఇంట్లో ఆ వస్తువులు ఖాళీగా ఉంచుతున్నారా.. దరిద్రం పట్టిపీడించడం ఖాయం?

Are You Keeping Those Things Empty At Home.. Is It Sure That Poverty Will Prevail..

Are You Keeping Those Things Empty At Home.. Is It Sure That Poverty Will Prevail..

వాస్తు శాస్త్రంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి, ఇంట్లో (Home) సానుకూల వాతావరణం నెలకొనడానికి ఎన్నో రకాల విషయాలను ప్రస్తావించారు. అయితే అందులో కొందరు కొన్నింటిని తూచా తప్పకుండా పాటిస్తే మరికొందరు మూఢనమ్మకాలు అంటూ కొట్టి పడేస్తూ ఉంటారు. అందులో భాగంగానే శాస్త్ర ప్రకారం కొన్ని రకాల వస్తువులను ఇంట్లో (Home) ఖాళీగా అసలు ఉంచకూడదట. వాటిని ఖాళీగా ఉంచడం వల్ల ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందట. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు చుట్టూ ముట్టడంతో పాటు దురదృష్టం పట్టిపీడిస్తుందట. మరి వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో (Home) ఎలాంటి వస్తువులను ఖాళీగా ఉంచకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

మీ జేబులోని ప‌ర్సును ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. వీటిలో ఎప్పుడూ ఎంతో కొంత డబ్బు ఉంచుకోవాలి. శాస్త్రం ప్రకారం ఇంట్లో (Home) డ‌బ్బు ఉంచే బీరువా లేదా పర్సు పూర్తిగా ఖాళీగా ఉంటే లక్ష్మీదేవి మీపై ఆగ్ర‌హిస్తుంది. ఆ సందర్భాలలో లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి గోమతి చక్రం, పసుపుతో పాటు కొంత డబ్బును ఎర్రటి గుడ్డలో కట్టి బీరువాలో ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఎప్పుడు కూడా బాత్రూంలో బకెట్ ఖాళీగా ఉంచకూడదు. మరి ముఖ్యంగా రాత్రి సమయములో బకెట్ ని ఖాళీగా ఉంచడం ఏమాత్రం మంచిది కాదు.

బకెట్ లో నీరు లేనప్పుడు ప్రతికూల శక్తి త్వరగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అదేవిధంగా బాత్రూంలో విరిగిన లేదా నల్లటి బకెట్ ను అసలు వినియోగించకూడదు. అలాంటివి ఉపయోగించడం వల్ల ఆర్థిక సమస్యలు వాస్తు దోషాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పూజ గదిలో ఎప్పుడు కూడా ఖాళీ కలశాన్ని ఉంచకూడదు. కలశంలో కొంచెం నీరు పోసి ఉంచాలి. పూజ‌ గదిలో ఖాళీ కలశం ఉంచడం అశుభం. క‌ల‌శ‌ పాత్రలో ఎల్లప్పుడూ కొంత నీరు, గంగాజలం, తులసి ఆకులు ఉండాలి. మీరు వీటిని పూజ‌ గదిలో ఉంచితే ఆ భగవంతుని అనుగ్రహం మీ కుటుంబం పై ఉంటుంది. ఇది ఇంట్లో ఆనందంతో పాటు శ్రేయస్సును తెస్తుంది. అలాగే వంట గదిలో ఉండే బియ్యం డబ్బా ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచరదు. ఇది ఇంట్లోకి దురదృష్టాన్ని తెస్తుంది.

Also Read:  Vote Without Voter ID Card: ఓటరు గుర్తింపు కార్డు లేకుండా ఓటు వేయవచ్చా..?