Blackheads Tips : బ్లాక్‌హెడ్స్‌ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే బొప్పాయితో ఇలా చేయాల్సిందే?

బ్లాక్‌హెడ్స్‌ (Blackheads)ని తగ్గించడంలో బొప్పాయి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి బొప్పాయిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Written By:
  • Publish Date - December 7, 2023 / 05:40 PM IST

అబ్బాయిలు, అమ్మాయిలు ఎక్కువగా బ్లాక్‌హెడ్స్‌ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ముక్కు,గడ్డం,చాతి భాగాలలో వస్తూ ఉంటాయి. కాలుష్యం, ఒత్తిడి వంటి కారణాల వల్ల బ్లాక్‌హెడ్స్‌ (Blackheads) ఏర్పడుతుంటాయి. బ్లాడ్‌హెడ్స్‌నూ దూరం చేసుకోవడానికి చాలా మంది ట్రీట్మెంట్స్‌ తీసుకుంటారు, క్లినిక్‌లకు, సెలూన్‌లకు వెళ్తుంటారు. బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడానికి కొన్ని సహాజమైన మార్గాలు సహాయపడతాయి. అయితే చాలామంది ఈ బ్లాక్ హెడ్స్ తగ్గించుకోవడానికి చాలామంది బ్యూటీ పార్లర్లకు వెళ్లడంతో పాటు అనేక రకాలుగా బ్యూటీ ప్రోడక్ట్లను కూడా వాడుతూ ఉంటారు. అయితే వాటికి బదులుగా ఇంట్లోనే దొరికే కొన్నింటిని ట్రై చేయడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. బ్లాక్‌హెడ్స్‌ (Blackheads)ని తగ్గించడంలో బొప్పాయి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి బొప్పాయిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

ముల్తానీ మట్టి, కమల తొక్క పొడిని రోజ్‌ వాటర్‌తో కలిపి మిశ్రమంలా తయారు చేసుకొని ఆ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్‌ ప్రదేశంలో అప్లై చేసి 5 నుంచి 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత ముఖం చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ముల్తానీ మట్టి చర్మంలోని అధిక నూనెను పీల్చుకుంటుంది. వారానికి రెండు సార్లు విధంగా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గుతుంది. అలాగే అరకప్పు చక్కెరలో రెండు చెంచాల బాదం నూనె వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే మంచి రిజల్ట్స్‌ ఉంటాయి. అలాగే బాగా పండిన బొప్పాయి తీసుకొని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. అందులో పావుస్పూను శెనగపిండి వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట అప్త్లె చేసి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చాలు వల్ల బ్లాక్‌హెడ్స్‌ తొలగిపోతాయి. పచ్చిపాలు కొద్దిగా తీసుకొని వాటితో బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట మృదువుగా మర్దన చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈవిధంగా రోజూ క్రమం తప్పకుండా చేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గుముఖం పడతాయి.

Also Read:  Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్ తినడం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!