Shani Remedies : శని ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నారా.. అయితే శనివారం ఇలా చేయాల్సిందే?

శనీశ్వరుడికి (God Shani) ఎంతో ఇష్టమైన శనివారం (Saturday) రోజున కొన్ని రకాల పనులు చేయడం వల్ల శని (Shani) అనుగ్రహం కలుగుతుంది.

Published By: HashtagU Telugu Desk
Are You Having Difficulties Due To The Influence Of Shani.. But Do You Have To Do This On Saturday..

Are You Having Difficulties Due To The Influence Of Shani.. But Do You Have To Do This On Saturday..

Shani Remedies : శనీశ్వరుడికి శనివారం ప్రీతికరమైన రోజు. అందుకే శనివారం రోజు శనీశ్వరుని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. శనివారం రోజున స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుస్తారని కష్టాల నుంచి గట్టెక్కించి ఇబ్బందులను తొలగిస్తాడని విశ్వసిస్తూ ఉంటారు. అయితే శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున కొన్ని రకాల పనులు చేయడం వల్ల శని (Shani) అనుగ్రహం కలుగుతుంది. మరి శని ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న వారు శనివారం ఎటువంటి పనులు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శనివారం రోజు భక్తులు దేవాలయాలకు వెళ్లి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాలి.

We’re Now on WhatsApp. Click to Join.

జాత‌కంలో శ‌ని (Shani) ప్ర‌భావం కార‌ణంగా, ఒక వ్యక్తి తన జీవితంలో అన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటాడు. అదే స‌మ‌యంలో శని సానుకూల ప్ర‌భావంతో ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో పురోగతిని ఎవరూ ఆపలేరు. శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు అనేక మార్గాలు పురాణాల్లో సూచించారు. వీటిలో శనైశ్చ‌రుడిని ప్రసన్నం చేసుకునేందుకు శ‌నివారం నాడు నల్ల కుక్కకు ఆహారం పెట్ట‌డం కూడా ఒకటి. మామూలుగా నల్ల కుక్కను శని దేవుడి వాహనంగా భావిస్తారు. ఆయ‌న‌ను ప్రసన్నం చేసుకోవాలంటే శనివారం నల్ల కుక్కకు నెయ్యితో చేసిన రొట్టె తినిపించాలి. ఈ పరిహారం చేయడం ద్వారా, వారి జీవితంలో త్వరలో సానుకూల ప్రభావాలను ఏర్పడతాయి. శనివారం నాడు నల్ల కుక్కను చూడటం ద్వారా మీ జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని, గ‌తంలో ఆగిపోయిన‌ మీ పనులు కూడా పూర్తి అవుతాయి.

ఆవనూనెతో చేసిన ఆహార ప‌దార్థాల‌ను శనివారం నల్ల కుక్కకు తినిపిస్తే, రాహు కేతువులకు సంబంధించిన దోషాలు కూడా మీ జీవితం నుండి తొలగిపోతాయి. శని దేవుడే కాకుండా, కాల భైరవుడి వాహ‌నంగా నల్ల కుక్కను పరిగణిస్తారు. కాబట్టి నల్ల కుక్కకు రొట్టెలు తినిపించడం ద్వారా జీవితంలో ఎదుర‌య్యే తీవ్రమైన ప్రమాదాల‌ను నివారించవచ్చు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్ల కుక్కకు రొట్టెలు తినిపించడం ద్వారా కాలసర్ప దోషం వంటి భయంకరమైన దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా శనివారం నల్ల కుక్కకు రొట్టెలు తినిపించడం వల్ల ప్రతికూల శక్తులు మీపై ఆధిపత్యం చెలాయించలేవు. శనివారం నల్ల కుక్కకి రొట్టెలు తినిపిస్తే మీ అప్పులన్నీ త్వరగా తీరుతాయి. మీరు పనిచేసే రంగంలో ఘ‌న‌ విజయం సాధిస్తారు, మీరు భ‌విష్య‌త్‌లో రుణం తీసుకోవలసిన అవసరం ఉండ‌దు. అలాగే శనివారం నల్ల కుక్కకు రొట్టెలు తినిపించడం వల్ల శని ప్రభావంతో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు.

Also Read:  Yamaha: యమహా నుంచి రెండు సరికొత్త బైక్ లు.. ఫీచర్లు ఇవే..!

  Last Updated: 09 Dec 2023, 01:01 PM IST