Site icon HashtagU Telugu

Lazy: బద్దకాన్ని దూరం చేసే సింపుల్ టిప్స్.. అవేంటంటే?

Lazy

Lazy

చాలామంది ఉదయాన్నే అలారం పెట్టుకొని పడుకోడం అలవాటు. కానీ ఉదయం సమయంలో అలారం మోగుతున్న సరే కాసేపు ఆగి లేద్దాం అని బద్దకంగా అలాగే పడుకుంటూ ఉంటారు. అలా నిద్రపోయి ఆ తరువాత లేచి చూసే సరికి టైమ్ అయ్యింది అని పరుగులు తీస్తూ ఉంటారు. ఇంకొందరు మాత్రం అలారం మోగగానే లేచి వారి పనులు కొద్ది వారు వెళుతూ ఉంటారు. కానీ చాలామంది బద్ధకంతో అలాగే పడుకుంటూ ఉంటారు. అయితే సాధారణంగా ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు సూచించినప్పటికీ ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్స్ లాప్టాప్స్ కారణంగా అర్ధరాత్రి 12 ఒంటిగంట అయినా కూడా పడుకోకుండా ఫోన్లు లాప్టాప్ లతో కాలక్షేపం చేస్తూ ఉదయాన్నే నిద్ర లేటుగా లేస్తూ ఉంటారు.

పల్లెటూరి ప్రాంతాలలో అయితే రాత్రి 9:00 కి తిని నిద్రపోయి ఉదయాన్నే నిద్ర లేచి వారి పనులకు కొద్ది వారి వెళుతూ ఉంటారు. కానీ పట్టణ ప్రాంతాలలో మాత్రం అర్ధరాత్రి వరకు మేలుకొని తెల్లవారి 9 అవుతున్న కూడా నిద్ర లేకుండా చాలామంది అలాగే పడుకుంటూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల చిన్న వయసులోనే అనేక రకాల ఆరోగ్య సమస్యల మారిన పడాల్సి వస్తోంది. మనిషికి నిద్ర అన్నది చాలా అవసరం. సరిగా నిద్ర పోకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ప్రతి రోజు రాత్రి సమయంలో కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు అయినా నిద్రపోవాలి. మరి బద్ధకం పోవాలి అంటే ఏం చేయాలి. అలాగే బద్ధకం దూరం అయ్యి ప్రతిరోజు సమయానికి లేవాలి అంటే ఎటువంటి విషయాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అందుకోసం ప్రతిరోజు కనీసం 7 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవాలి. ఈ విధంగా చేయడం వల్ల శరీరానికి కావలసినంత విశ్రాంతి దొరుకుతుంది. దాంతో మనం ఉదయం లేవాల్సిన సమయం కంటే ముందుగా దానికి అనుగుణంగా మనం నిద్ర లేయవచ్చు. రాత్రి 11 గంటల లోపు నిద్రపోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ ప్రస్తుత రోజుల్లో మొబైల్ స్క్రీన్ లకు అతుక్కుపోతూ సమయం ఎంత అయ్యిందో కూడా పట్టించుకోకుండా వాటితోనే కళ్ళక్షేపం చేస్తూ అర్ధరాత్రి సమయంలో నిద్ర పోతూ ఉంటారు. ప్రతిరోజు పడుకునే ముందు మొబైల్స్ ను దూరం పెట్టి నిద్రపోవడం ప్రాక్టీస్ చేస్తే ఆ విధానానికి మన శరీరం అలవాటు పడుతుంది. దాంతో మనం అనుకున్న సమయానికి నిద్ర లేవడంతో పాటు బద్ధకం కూడా పోతుంది. చాలామంది ఉదయం త్వరగా లేచినప్పటికీ కూర్చుంటూ నిలబడుతూ బద్దకంగా పనులు చేస్తూ ఉంటారు. అటువంటివారు ప్రతిరోజు నిద్ర లేవగానే వాకింగ్, వ్యాయామం అలవాటు చేసుకోవడం వల్ల త్వరగా నిద్ర లేవడానికి అలవాటు పడడంతో పాటు బద్ధకం కూడా మందగిస్తుంది. అలాగే శరీరంలోని భాగాలు చురుగ్గా పనిచేసి రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడంతో పాటు బద్ధకం కూడా దూరం అవుతుంది.