చియా విత్త‌నాల‌ను తింటున్నారా..?.. అయితే ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే..!

చిన్నవిగా కనిపించే ఈ విత్తనాలు ఆరోగ్యానికి పెద్ద మేలు చేస్తాయి. ఫైబర్, ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ప్రోటీన్లు వంటి అనేక ముఖ్యమైన పోషకాలు చియా విత్తనాల్లో సమృద్ధిగా ఉంటాయి.

Published By: HashtagU Telugu Desk
Are you eating chia seeds? But you must know these things!

Are you eating chia seeds? But you must know these things!

. ప్యాక్ చేసిన పానీయాలు, డైరీతో ఎందుకు వద్దు?

. కొన్ని ఆహార కలయికలు ఎందుకు ప్రమాదకరం?

. కెఫిన్, ఆల్కహాల్, మసాలా ఆహారాలకు దూరంగా ఉండండి

Chia Seeds : ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో సహజమైన పోషక విలువలు ఎక్కువగా ఉన్న ఆహారాల వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. అలాంటి సూపర్ ఫుడ్స్‌లో చియా విత్తనాలు ఒకటి. చిన్నవిగా కనిపించే ఈ విత్తనాలు ఆరోగ్యానికి పెద్ద మేలు చేస్తాయి. ఫైబర్, ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ప్రోటీన్లు వంటి అనేక ముఖ్యమైన పోషకాలు చియా విత్తనాల్లో సమృద్ధిగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, గుండె ఆరోగ్యం కాపాడబడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అయితే “ఆరోగ్యానికి మంచిదే కదా” అని అనుకుని ఎలా పడితే అలా చియా విత్తనాలను తీసుకోవడం సరైంది కాదు. కొన్ని ఆహారాలతో కలిపి తీసుకుంటే ప్రయోజనం తగ్గడమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చియా విత్తనాలను ప్యాక్ చేసిన పండ్ల రసాలతో కలిపి తీసుకోవడం మంచిది కాదు. ఈ రసాల్లో చక్కెర, ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. చియా విత్తనాలతో కలిపితే రక్తంలో షుగర్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. అందుకే వీటిని నీటితో లేదా బాదం పాలు ఓట్స్ పాలు వంటి మొక్కల ఆధారిత పాలతో తీసుకోవడం ఉత్తమం. అలాగే ఫుల్ ఫ్యాట్ డైరీ ఉత్పత్తులతో చియా విత్తనాలను కలపకూడదు. డైరీలోని అధిక కొవ్వు జీర్ణక్రియను మందగింపజేస్తుంది. ఫలితంగా చియా విత్తనాల్లోని పోషకాలు పూర్తిగా శరీరానికి అందవు. ఫైటిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే గింజలు, బీన్స్, సంపూర్ణ ధాన్యాలతో చియా విత్తనాలను కలిపి తినడం వల్ల ఖనిజాల శోషణకు ఆటంకం కలుగుతుంది. ఐరన్, కాల్షియం, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు శరీరానికి అందకుండా పోతాయి.

సిట్రస్ పండ్లు (నిమ్మ, ఆరెంజ్) విటమిన్ సీ ఎక్కువగా ఉన్నప్పటికీ చియా విత్తనాలతో కలిపి తీసుకుంటే యాసిడ్ రిఫ్లెక్స్, గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంది. బదులుగా అరటిపండ్లు, ఆపిల్ వంటి మైల్డ్ పండ్లతో తీసుకోవచ్చు. చియా విత్తనాలు తీసుకునే ముందు లేదా తరువాత టీ, కాఫీ వంటి కెఫిన్ పానీయాలను తీసుకోవద్దు. ఇవి డీహైడ్రేషన్‌కు కారణమై పోషకాల శోషణను తగ్గిస్తాయి. అలాగే ఆల్కహాల్ తీసుకున్న వెంటనే చియా విత్తనాలు తినకూడదు. రెండు కలిస్తే జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి ఉబ్బరం పొట్ట నొప్పి వంటి సమస్యలు రావచ్చు. మసాలా ఆహారాలతో చియా విత్తనాలు తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇది యాసిడిటీని పెంచి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. చియా విత్తనాలను సరైన విధంగా, సరైన ఆహారాలతో కలిపి తీసుకున్నప్పుడే వాటిలోని పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయని వైద్యులు సూచిస్తున్నారు.

 

  Last Updated: 22 Jan 2026, 08:44 PM IST