చాలామందికి రోజు మొదలుపెట్టే కాఫీ బ్రేక్‌కు బదులు ఒక కప్పు చాయే (Tea) హాయిగా ఉంటుంది. అలాంటి టీకి ఒక చిన్న చేర్చు, యాలకుల (cardamom ) జోడింపు వల్ల రుచి మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. సుగంధ ద్రవ్యాల్లో అగ్రగణ్యమైన యాలకులు టీలో వేసిన వెంటనే తీపి, సువాసన పరిమళంతో మనసును పరవశింపజేస్తాయి. దీని ప్రత్యేకత కేవలం రుచిలో కాదు… శరీరానికి ఉపయోగకరమైన ఎన్నో రకాల ఫలితాలు కూడా ఉన్నాయి.
యాలకులు జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంటాయి. టీలో వాటిని జోడించడం ద్వారా జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరిగి అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే మెటబాలిజం రేటును పెంచే గుణం వల్ల కేలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాక, ఇది డిటాక్సిఫికేషన్ ప్రక్రియలో కూడా సహాయపడుతుంది. కాలేయం, మూత్రపిండాల పనితీరును మద్దతుగా నిలిచి, విషపదార్థాలను శరీరం నుంచి బయటకు పంపుతుంది.
Sridevi Apalla : కోర్ట్ మూవీ హీరోయిన్ పెళ్లి..అసలు నిజం ఇదే !!
యాలకులు ఒత్తిడిని తగ్గించే సహజ లక్షణాలతో ప్రసిద్ధి చెందాయి. టీలో జోడించినప్పుడు, ఇది సెరోటోనిన్ వంటి సానుకూల హార్మోన్ల ఉత్పత్తిని ప్రోత్సహించి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఇది ఆందోళన, మానసిక ఒత్తిడికి మంచి నివారణ. అదనంగా, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది, శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడుతుంది. ఈ గుణాలన్నీ దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉంచుతాయి.
యాలకులు నోటి దుర్వాసనను తగ్గించడంలో, దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇందులో ఉన్న సినోల్ పదార్థం బాక్టీరియాను నాశనం చేస్తుంది. శ్వాస సంబంధిత సమస్యలకు సహజ చికిత్సగా పనిచేస్తుంది. దగ్గు, బ్రాంకైటిస్ వంటి సమస్యలకు ఇది ఉపశమనం ఇస్తుంది. అదేవిధంగా, గుండె ఆరోగ్యానికీ యాలకులు ఉపయోగపడతాయి. రక్త ప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రిస్తూ గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తాయి. సో ఓ చిన్న యాలకాన్ని టీ కప్పులో వేసే అలవాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.