Diet with Juice : బరువు తగ్గాలనే తపనతో కొందరు కఠిన నిర్ణయాలు తీసుకుంటారు.ఆహారాన్ని పూర్తిగా మానేసి, కేవలం పండ్ల రసాలపైనే ఆధారపడటం అలాంటి ప్రమాదకరమైన ఆలోచనల్లో ఒకటి. తమిళనాడులో ఇటీవల జరిగిన ఒక సంఘటన దీనికి నిదర్శనం. బరువు తగ్గాలని కేవలం పండ్ల రసాలు తాగి ఒక వ్యక్తి మరణించడం అందరినీ కలచివేసింది. ఇంతకీ కేవలం పండ్ల రసాలు తాగడం వల్ల ఏం జరుగుతుంది? శరీరానికి ఎలాంటి నష్టం వాటిల్లుతుంది?
పండ్ల రసాలు..
కేవలం పండ్ల రసాలు తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. వాటిల్లో ఉండే ప్రోటీన్లు కేవలం తక్షణ ఎనర్జీని మాత్రమే అందిస్తాయి. పండ్ల రసాలలో సహజ చక్కెరలు ఉన్నప్పటికీ, వాటిలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ చాలా తక్కువగా ఉంటాయి లేదా అస్సలు ఉండవు.దీంతో శరీరానికి దీర్ఘకాలంలో కావాల్సిన శక్తి అందలేదు. ఈ పోషకాలు కండరాల నిర్మాణానికి, రోగనిరోధక శక్తికి, శరీరంలోని అన్ని విధుల సరైన నిర్వహణకు అత్యవసరం.వీటి లోపం వల్ల శరీరం బలహీనపడి, వ్యాధుల బారిన పడే అవకాశం పెరుగుతుంది. తద్వారా శరీరం శక్తిని కోల్పోయి నీరసానికి గురవుతుంది.
అంతేకాదు, పండ్ల రసాలలో ఫైబర్ లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగి, తగ్గుతాయి. ఇది శక్తి స్థాయిలలో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. ఫలితంగా తరచుగా అలసట, నీరసం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో ఇది ఇన్సులిన్ నిరోధకత, డయాబెటిస్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా దారితీయవచ్చు. జీర్ణవ్యవస్థ కూడా దెబ్బతింటుంది, ఎందుకంటే ఫైబర్ లేకపోవడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. మనిషి తీసుకుననే ఆహారంలో తప్పకుండా కార్బోహైడ్రేట్స్ అవసరం. లేదంటే శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందకపోవచ్చు.
శరీరానికి తగినన్ని కేలరీలు అందకపోవడం వల్ల శరీరం తన నిల్వలను, ముఖ్యంగా కండరాలను, శక్తి కోసం ఉపయోగించుకోవడం ప్రారంభిస్తుంది. ఇది కండరాల క్షీణతకు దారితీస్తుంది. కండరాల నష్టం వల్ల బలహీనత, శరీర పనితీరు మందగించడం, ప్రమాదకరంగా బరువు తగ్గడం జరుగుతుంది. ఇది అవయవాల పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే కేవలం జ్యూసుల మీద ఆధారపడి బరువు తగ్గాలని అనుకోవడం చాలా తప్పు. జిమ్ ట్రైనర్ సలహా, సూచనలు పాటించడం చాలా అవసరం.
బరువు తగ్గడానికి సరైన పద్ధతి సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం. వైద్య నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. కేవలం పండ్ల రసాలపై ఆధారపడి బరువు తగ్గాలనుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.ఇలాంటి పద్ధతులు ప్రాణాలకే ముప్పు తెస్తాయని గుర్తుంచుకోండి. మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి బరువు తగ్గాలనుకోవడం తెలివైన పని కాదు. అందుకే శరీరానికి హాని కలిగించని విధంగా డైట్ పాటిస్తూ బరువు తగ్గడం వలన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం వాటిల్లదు.
Apps Optimisation : మీ ఫోన్లో రోజుకోసారైనా యాప్స్ అప్డిమైజేషన్ చేయడం లేదా? ఏం జరుగుతుందో తెలుసా?