Bedroom & Kitchen Tips : పడకగదిలో, వంటింట్లో అలాంటి పనులు చేస్తున్నారా..? అయితే ఆర్థిక నష్టం రావడం గ్యారెంటీ..

వాస్తు శాస్త్ర ప్రకారంగా పడక గదిలో (Bedroom) వంటగదిలో (Kitchen) కొన్ని రకాల పనులు చేయడం నిషేధం.

  • Written By:
  • Publish Date - December 22, 2023 / 08:00 PM IST

Bedroom and Kitchen Tips : ప్రస్తుత రోజుల్లో వాస్తు శాస్త్రాలను వాస్తు విషయాలను నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో ప్రతి ఒక్క విషయంలో చాలామంది వాస్తు విషయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. వాస్తుకు సంబంధించిన అనేక నియమాలు వ్యక్తిగత జీవితాల మీద ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయన్న విషయం మనందరికి తెలిసిందే. వాస్తు పరిజ్ఞానం కలిగిన పండితులతో ఇంటి వాస్తును పరీక్షించి చూసుకోవడం అవసరం. ఒక్కోసారి మనం చేసే చిన్నచిన్న పొరపాట్లు కూడా వాస్తు దోషాలకు కారణం అవుతాయి. అటువంటి వాటిలో పడకగదిలో (Bedroom) అలాగే వంటగదిలో (Kitchen) మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా ఒకటి. అయితే వాస్తు శాస్త్ర ప్రకారంగా పడక గదిలో (Bedroom) వంటగదిలో (Kitchen) కొన్ని రకాల పనులు చేయడం నిషేధం. మరి ఎటువంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

కాగా మొదట పడకగదిలో చెయ్యకూడని పనుల విషయానికి వస్తే.. మామూలుగా భోజనం చెయ్యడానికి డైనింగ్ హాల్‌ను వాడతాం. అంత పెద్ద ఇల్లు లేని వారు చిన్న డైనింగ్ టేబుల్ పెట్టుకొని అక్కడ భోజనం చేస్తారు. లేదా హాల్లో కింద కూర్చొని తింటారు. కానీ ఈ మధ్య చాలా మంది మంచం మీద కూర్చుని తినటం అలవాటుగా మార్చుకున్నారు. కానీ ఇలా అసలు చెయ్యకూడదు. వాస్తు ప్రకారం మంచం మీద కూర్చుని భోజనం చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. ఫలితంగా దారిద్ర్యం దాపున చేరుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచంపై కూర్చుని భోజనం చెయ్యకూడదు. అలాగే మంచం మీద కూర్చుని టీ, కాఫీ, జ్యూస్ ల వంటివి తాగి లేచి లోపల పెట్టేందుకు బద్ధకించి ఎంగిలి కప్పులు పక్కనే పెట్టేసుకుంటారు.

తెలియక చేసే ఈ తప్పు వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ చేరుతుంది. దిండుకింద రకరకాల వస్తువులు పెడుతుంటారు. అలా ఏది పడితే అది దిండు కింద దాచడం కూడా మంచిదికాదు. ఇది వ్యక్తిగత అభివృద్ధిని ఆటంకపరుస్తుంది. ఇక కిచెన్ లో చెయ్యకూడని పనుల విషయానికి వస్తే..
ఇంట్లో వంటిల్లు ఆగ్నేయంలో నిర్మించుకోవడం మంచిది. వంటింట్లో భోజనం ఎప్పుడూ చెయ్యకూడదు. భోజనం చేసే ముందు వంటగదిలో నుంచి బయటకు రావాలి. రాత్రి భోజనాల తర్వాత వంటింట్లో ఎంగిలి పాత్రలు ఉంచకూడదు. ఇది అన్నపూర్ణా దేవికి కోపం తెప్పిస్తుంది. వంటగది ఎప్పుడూ శుభ్రంగా పెట్టుకోవాలి. వంటగదికి ఎదురుగా బాత్రూమ్ ఉండకూడదు. ఇది పెద్ద వాస్తుదోషానికి కారణం అవుతుంది. ఇలాంటి ఇంట్లో ధనం నిలవదు. క్రమంగా ఆర్థిక సమస్యలు చుట్టు ముట్టి దారిద్ర్యానికి కారణం అవుతుంది.

Also Read:  Snacks For Winter: చలికాలంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలనుకుంటే.. ఈ స్నాక్స్ ట్రై చేయండి..!