Sitting on Chair : చాలా మంది ఉద్యోగులు గంటల తరబడి కుర్చీలలో కూర్చొని పనిచేస్తారు. ఈ జీవనశైలి చాలా హానికరం. దీనివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిరంతరంగా కూర్చోవడం వలన బరువు పెరగడం, ఒబేసిటీ, వెన్నునొప్పి, మెడనొప్పి, డయాబెటిస్, గుండె జబ్బులు వంటి సమస్యలు వస్తాయి. కూర్చున్నప్పుడు కదలికలు లేకపోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ముఖ్యంగా పొట్టలో, తొడల మీద కొవ్వు పెరుగుతుంది. ఇది తరువాత అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
దేని మీద ముఖ్యంగా అధిక ఒత్తిడి కలుగుతుందంటే?
గంటల కొద్దీ కూర్చోవడం వల్ల వెన్ను, మెడపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది వెన్నునొప్పికి, కీళ్ల నొప్పులకు, భుజాల నొప్పులకు దారి తీస్తుంది. వెన్నుముక బలహీనపడటం, కూర్చొనే భంగిమలో మార్పులు రావడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా, ఇలా కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగదు. ఇది గుండె సంబంధిత సమస్యలను పెంచుతుంది. రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా ఉంది.
ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికి, ప్రతి గంటకు ఒకసారి లేచి 5-10 నిమిషాలు నడవాలి. కుర్చీలో గంటల తరబడి కూర్చోవడం కంటే, 45 నిమిషాల నుంచి 1 గంట వరకు కూర్చొని, ఆ తరువాత లేచి కాసేపు నడవడం, చేతులు, కాళ్లు స్ట్రెచ్ చేయడం వంటివి చేయాలి. రోజులో కనీసం 30 నిమిషాల నుంచి 1 గంట వరకు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. నడవడం, పరిగెత్తడం, సైక్లింగ్ చేయడం వంటివి గుండె జబ్బులను నివారిస్తాయి.
Ambati Rayudu: సూర్యకుమార్ యాదవ్ క్యాచ్‌పై అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు!
ఎలాంటి రూల్స్ పాటించాలి
వెన్నునొప్పి, మెడనొప్పి రాకుండా ఉండటానికి, కూర్చునే భంగిమ సరైన పద్ధతిలో ఉండాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు వెన్నుముకను నిటారుగా ఉంచాలి, భుజాలను వెనుకకు లాగి కూర్చోవాలి. కంప్యూటర్ స్క్రీన్‌ను కంటికి సమాంతరంగా ఉండేలా పెట్టుకోవాలి. దీనివల్ల మెడపై ఒత్తిడి తగ్గుతుంది. మెడకు, వెన్నుకు సంబంధించిన వ్యాయామాలు ప్రతిరోజూ చేయడం వల్ల ఈ నొప్పులను నివారించవచ్చు. ఒబెసిటీ రాకుండా ఉండాలంటే, పోషకాహారం తీసుకోవాలి. ఎక్కువగా కూరగాయలు, పండ్లు, ప్రొటీన్ ఉండే ఆహారాలు తీసుకోవాలి. అధిక కొవ్వు, చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలి.
ఒకే చోట కూర్చోకుండా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం చాలా మంచిది. పక్కన ఉన్న సహోద్యోగితో మాట్లాడటానికి లేచి వెళ్లడం, వాటర్ బాటిల్ కోసం లేచి నడవడం వంటివి అలవాటు చేసుకోవడం మంచిది. వీలైనంత వరకు పని ప్రదేశంలో మెట్లు ఎక్కి దిగడం, వాకింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం వంటి చిన్న చిన్న పనులు చేయడం వల్ల ఎక్కువ సేపు కూర్చోకుండా ఉండవచ్చు. పనిప్రదేశంలో లేదా ఇంట్లో ఉన్నప్పటికీ, చురుకుగా ఉండటానికి ప్రయత్నించాలి. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.
Indiramma Housing Scheme : గుడిసెలు లేని గ్రామంగా బెండాలపాడు