Site icon HashtagU Telugu

Social media: సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్నారా.. అయితే ఒత్తిడి బారిన పడ్డట్టే

social media

Jpg Imresizer

Social media: సోషల్ మీడియాను ఉపయోగించడం వలన రిస్క్‌లతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా ఇతరులు పోస్ట్ చేసిన కంటెంట్‌ను క్రిందికి స్క్రోల్ చేయడం, చూడటం వల్ల ఒత్తిడి, అసంతృప్తి పెరుగుతుందని పరిశోధకులు అంటున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఎలాగైనా చాలామందిని ఆకర్షిస్తుండటం మరో కారణం.

అయితే జర్మనీలోని రూర్ యూనివర్సిటీ  డాక్టర్ ఫిలిప్ ఒజిమెక్ నేతృత్వంలోని పరిశోధకులు సర్వే చేశారు.  చాలామంది సోషల్ మీడియాలో రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే గడిపినట్లు పేర్కొన్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టాను చెక్ చేయడం వల్ల  ఇతరులతో తమను తాము పోల్చుకునే ధోరణిని కలుగుతుండట.  ఈ క్రమంలో సోషల్ మీడియాను మరింత యాక్టివ్‌గా ఉపయోగిస్తున్నట్లు తేలింది. దీంతో కొంతమంది సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారట.  ఈక్రమంలో ఎంతో ఒత్తిడికి లోనయ్యారు.

ఇతర వినియోగదారులు పోస్ట్ చేసిన కంటెంట్‌ను చూడటం ద్వారా, సోషల్ మీడియాలో బ్రౌజ్ చేయడం చాలా సులభం. కానీ గంటల తరబడి పోస్టులు చూడటం సర్వ సాధారణంగా మారిందట. గంటల కొద్దీ మొబైల్ ను యూజ్ చేయడం వల్ల కూడా చాలామంది సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారని తేలింది. స్క్రీన్ సమయాన్ని తగ్గించకుండా అదేపనిగా వాడుతుండటంతో చాలామంది కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించారు.