Site icon HashtagU Telugu

Spiders in Home : సాలీడు పురుగులు మీ ఇంట్లో అధికంగా తిరుగుతున్నాయా? అది దేనికి సంకేతమో తెలుసా!

Spiders In Home

Spiders In Home

Spiders in home : ఇంట్లో సాలీడు పురుగులు కనిపించడం సాధారణ విషయం. కానీ కొంతమంది దీన్ని వాస్తు శాస్త్రం లేదా శుభా-అశుభాల కోణంలో కూడా చూడటం జరుగుతుంది. పాత ఇళ్లలో లేదా ఎక్కువ కాలంగా శుభ్రం చేయని ప్రదేశాల్లో వీటి ఉనికి ఎక్కువగా ఉంటుంది. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఇది ఏమి సూచిస్తుంది, ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. లేనియెడల కుటుంబంలోని వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం అర్థం
వాస్తు నిపుణుల ప్రకారం, ఇంట్లో సాలీడు పురుగులు ఎక్కువగా తిరగడం శుభప్రదంగా భావించబడదు. ముఖ్యంగా పూజా గది, వంటగది, ప్రధాన ద్వారం దగ్గర వీటి ఉనికి ఉంటే, ఇంట్లో శుభశక్తులు తగ్గి, చెడు శక్తులు పెరుగుతాయని నమ్మకం. ఇది ఇంటి ఆర్థిక స్థితి మందగించడానికి లేదా కుటుంబంలో విభేదాలు రావడానికి సంకేతమని కొందరు భావిస్తారు. అందుకే వీలైనంత వరకు వాటిని ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి.

AP : గ్రీన్ వర్క్‌ఫోర్స్ విప్లవానికి కేంద్రంగా ఏపీ.. రేపు దేశంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్‌..

అనారోగ్య సమస్యల అవకాశం
ఆరోగ్య పరంగా చూస్తే, సాలీడు పురుగులు నేరుగా పెద్దగా హాని చేయకపోయినా, వాటి జాలాలు, మట్టి, ఇతర క్రిములు చేరే ప్రదేశాలు ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ముఖ్యంగా కిచెన్ లేదా బాత్రూమ్‌లో వీటి ఉనికి ఉండటం వల్ల ఆహార పదార్థాలు కాలుష్యం చెంది, కడుపు సమస్యలు లేదా అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంటుంది. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతారు. దీంతో ప్రతిసారి కుటుంబంలోని వారు ఆస్పత్రిపాలు కావాల్సి వస్తుంది.

ఎందుకు ఎక్కువగా వస్తాయి?
పాత ఫర్నిచర్, మూల ప్రదేశాలు, తేమ ఎక్కువగా ఉన్న గదులు, ఎక్కువ కాలంగా శుభ్రం చేయని మూలలలో సాలీడు పురుగులు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇవి చురుకుగా తిరుగుతాయి. కాబట్టి, క్రమంగా శుభ్రం చేయడం, మూలల్లోని జాలాలను తొలగించడం అవసరం. ఇళ్లుఎంత శుభ్రంగా ఉంటే కుటుంబంలోని వారు అంత ఆరోగ్యంగా ఉంటారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వీటి ఉనికి తగ్గించడానికి ఇంట్లో గాలి ప్రసరణ బాగా ఉండేలా చూసుకోవాలి. తేమ తగ్గించడానికి డీహ్యూమిడిఫయర్ వాడడం లేదా సూర్యకాంతి రావడం అవసరం. పూజా గది, కిచెన్, బాత్రూమ్‌లను ప్రతిరోజూ శుభ్రం చేస్తే, సాలీడు పురుగుల సమస్య తగ్గుతుంది. అవసరమైతే కీటకనాశిని సేవలు తీసుకోవడం మంచిది

వాస్తు పరిహారాలు..

Tollywood Strike : చిరంజీవిని కలవబోతున్న టాలీవుడ్ నిర్మాతలు