Protein Shake: ప్రోటీన్ షేక్ శరీరానికి హాని చేస్తుందా…?

ఈమధ్యకాలంలో ప్రొటీన్ షేక్స్ చాలామంది ఉపయోగిస్తున్నారు. కానీ దీని వాడకం వల్ల శరీరానికి ఎంత హాని జరుగుతుందో తెలుసా.

  • Written By:
  • Publish Date - June 1, 2022 / 01:15 PM IST

ఈమధ్యకాలంలో ప్రొటీన్ షేక్స్ చాలామంది ఉపయోగిస్తున్నారు. కానీ దీని వాడకం వల్ల శరీరానికి ఎంత హాని జరుగుతుందో తెలుసా. ప్రొటీన్ పౌడర్ ను జంతువులు లేదా మొక్కల వనరుల నుంచి తయారు చేయబడిన ఆహార అనుబంధం. దీనిలో పాలు, పాల విరుగుడు, కేసైన్, మాంసం, పౌల్ట్రీ , గుడ్లు, సీఫుడ్, ఎండిన పండ్లు, విత్తనాలు, సోయా ప్రొడక్ట్స్, బీన్స్, బఠానీలు ఉపయోగిస్తారు. దీని వాడకంతో శరీరంలోని ప్రోటీన్ లోపాన్ని తొలగించవచ్చు.

అయితే ప్రొటీన్ పౌడర్ వల్ల దుష్ర్పభావాలు…ఏవైనా సరే పరిమితిలోనే తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు పోషకాన్ని ఎక్కువకాలం తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదట. దీనిని ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాం.

డీహైడ్రేషన్:
ప్రొటీన్ షేక్స్ ను ఎక్కువగా తీసుకునే వ్యక్తులకు నిర్జలీకరణ సమస్యలు ఎదుర్కోవల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు

చర్మంపై.:
అధిక మొత్తంలో ప్రోటీన్లను తీసుకుంటే… హార్మోన్ల ఉత్పత్తి వేగంగా పెరుగుతుంది. ఇది ముఖంపై మొటిమలు, ఎర్రబారడం, వాపు వంటి చర్మ సంబంధిత సమస్యలకు కారణం అవుతుంది.

రక్తపోటు:
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎక్కువగా ప్రోటీన్ షేక్స్ తీసుకుంటే..రక్తపోటు తగ్గడం ప్రారంభమవుతుంది. అలాంటి పరిస్థితిలో మీకు తక్కువ రక్తపోటు సమస్య ఉంటే ప్రోటీన్ షేక్ ను తీసుకోకపోవడమే బెటర్.

మూత్రపిండాల్లో:
ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల సమస్యలు తలెత్తుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు ప్రోటీన్ పౌడర్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. అలాగే పప్పుధాన్యాలు, ఇతర ప్రోటీన్ అధికంగా ఉండే వస్తువులను తీసుకోవడం దాదాపుగా తగ్గించాలి.

ప్రోటీన్ షేక్ ఎలా తీసుకోవాలి.:
ఎప్పుడూ కూడా మీరు తాజా ప్రోటీన్ షేక్ నే తీసుకోవడం మంచిది. నిల్వ ఉంచిన షేక్ ఆరోగ్యానికి హాని చేస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రోటీన్ షేక్ చేయడానికి.. ముందుగా పాలను మిక్సర్ గ్రైండర్ లో పోసి.. దీనిలో 1-2 స్కూప్ ప్రోటీన్ పౌడర్ వేయండి. 5 నిమిషాలు పాట్ మిక్స్ చేసి గ్లాస్ లో తీసుకుని తాగండి. మాంసాహారులు రోజుకు 1-2 స్కూప్ల పాల విరుగుడు ప్రోటీన్ తీసుకోవడం మంచిది. శాకాహారులైతే 2-3 స్కూప్ లు తీసుకోవచ్చు. ఏదేమైనా వైద్యుడి సలహా తీసుకుని దీన్ని వాడటం మంచిది.