Hail Stones : వడగళ్ళు మంచివా? కావా? వడగళ్ళు తినొచ్చా?

వడగళ్ళతో చిన్నపిల్లలు సరదాగా ఆడుకుంటారు, తింటారు. పెద్దవారు కూడా కొంతమంది వీటిని నోట్లో వేసుకొని తింటూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - May 9, 2023 / 10:00 PM IST

వడగళ్ళు(Hail Stones) రాళ్ళ రూపంలో ఉండే ఐస్(Ice) గడ్డలు. అయితే అవి వానాకాలంలోనూ(Rainy Season), ఎండాకాలంలోనూ(Summer) బాగా వానలు(Rains) పడినప్పుడు పడుతుంటాయి. వడగళ్ళ సైజు ఒక అంగుళం నుండి నాలుగు అంగుళాల వరకు పొడవు ఉంటుంది. వడగళ్లు ఎక్కువగా ఫిబ్రవరి నుండి జూన్(June) లేదా జులై వరకు పడుతుంటాయి. ఇంకా ఉరుములు బలంగా ఉంటే ఎప్పుడైనా వడగళ్లు పడవచ్చు. కానీ వడగళ్ళు ఎప్పుడు పడినా రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో రైతులకు మాత్రం వడగళ్ల వాన వలన పంట నష్టం కలుగుతుంది. ఎందుకంటే వడగళ్ల వాన పడినప్పుడు పంటలు అన్నీ నేలకొరిగి పంటను దెబ్బతీస్తాయి. కాబట్టి వడగళ్ళు రైతులకు కన్నీళ్లను మిగులుస్తాయి.

వడగళ్ళతో చిన్నపిల్లలు సరదాగా ఆడుకుంటారు, తింటారు. పెద్దవారు కూడా కొంతమంది వీటిని నోట్లో వేసుకొని తింటూ ఉంటారు. వడగళ్ళు సల్ఫేట్, నైట్రేట్స్, అమ్మోనియం అయాన్లు, క్లోరైడ్ అయాన్లు కలిసిన రసాయనాలు ఉండడం వలన తయారవుతాయి. ఇంకా దుమ్ము, కాలుష్యం కూడా వాటిలో కలిసి ఉంటుంది. వడగళ్ళులో రసాయనాలు, దుమ్ము, కాలుష్యం ఉంటాయి కాబట్టి అవి మన ఆరోగ్యానికి మంచివి కాదు, వాటిని తినకూడదు. వడగళ్ళను తింటే మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి చిన్న పిల్లలైనా, పెద్దవారైనా వడగళ్ళను తినకూడదు.

వడగళ్ళు అనేవి మనకు ఆరోగ్యపరంగా నష్టాన్ని కలిగిస్తాయి అని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు కాబట్టి వాటిని ఎవరూ తినకూడదు. అదేవిధంగా పంటలకు కూడా వడగళ్ళు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. వడగళ్ళ వాన ఎక్కువగా పడితే ఒక్కొక్కసారి వాహనాలు, భవనాలు కూడా దెబ్బతింటాయి. వడగళ్ళ వాన పడినప్పుడు బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వడగళ్ళు బాగా ఫోర్స్ గా రావడంతో మనకు కూడా దెబ్బలు తగులుతాయి. కాబట్టి ఇకనుంచి వడగళ్ళు తినే వాళ్ళు ఎవరైనా ఉంటే మానేయండి, పిల్లలకు కూడా వాటిని తినొద్దని చెప్పండి.

 

Also Read :  E-Scooter Charging Tips: కొన్ని నిమిషాలలోనే ఎలక్ట్రిక్ స్కూటర్లకు పూర్తిగా చార్జ్.. ఎలా అంటే?