Site icon HashtagU Telugu

Heart Pain & Chest Pain: ఛాతి నొప్పి, గుండె నొప్పి ఒక్కటేనా?

Chest Pain

Are Chest Pain And Heart Pain The Same Thing

గుండె నొప్పి (Heart Pain) వచ్చిదంటే చాలు ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్లే. నేడు అనేక కారణాల వల్ల గుండె సమస్యలు పెరిగాయి. రోజురోజుకి గుండె సంబంధ లక్షణాలతో మరణిస్తున్న వారి సంఖ్య పెరగడం ప్రతి ఒక్కరినీ భయాలకు గురిచేస్తున్నాయి. అందుకే, ఆ సమస్యను దూరం చేసేందుకు ముందు నుంచీ గుండె సమస్యల గురించి అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఛాతీ నొప్పి, గుండె నొప్పి (Heart Pain) లక్షణమా.. ఈ నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం.

లైఫ్‌స్టైల్ కారణంగానే రిస్క్

ఒత్తిడితో కూడిన జీవనం, జంక్ ఫుడ్, వర్కౌట్ చేయకపోవడం, అనారోగ్యానికి కారణమైన అలవాట్లు ఇవన్నీ కూడా బరువు పెరగడానికి కారణమవుతాయి. బరువు పెరిగనప్పుడు ఆటోమేటిగ్గా గుండెపై ఎఫెక్ట్ పడి గుండె సమస్యలు వస్తాయి. అందుకే ముందు నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

మాయో క్లినిక్ ప్రకారం

మాయో క్లినిక్ ప్రకారం ఛాతీ నొప్పి ఎన్నో రకాలుగా ఉంటుంది. కొన్ని సార్లు ఛాతీనొప్పి మంటగా ఉంటుంది. కొన్నిసార్లు మెడపైకి, దవడలో, చేతుల్లో నొప్పి కూడా ఉంటుంది. ఛాతీ నొప్పి అనేక కారణాల వల్ల వస్తుంది. కొన్నిసార్లు గుండె సమస్య వల్ల రావొచ్చు. ఊపిరితిత్తుల సమస్యల వల్ల వస్తుంది. కాబట్టి ఎప్పుడు నొప్పి వచ్చినా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

డాక్టర్స్ ప్రకారం

గుండె సమస్యల గురించి డా.వివేక్ కుమార్ గుండె సమస్యల గురించి అనేక విషయాలు చెప్పారు. ఈయన ప్రకారం ఛాతీ నొప్పి అనేది గుండె సమస్య రావడానికి 10 శాతం కారణంగా ఉంటుంది. ఇది ఉన్నవారిలో 10 శాత గుండె సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

మరో డాక్టర్

ఇక డాక్టర్ బిక్కీ చౌరాసియా ప్రకారం..ఛాతీ నొప్పి అనేది గుండె సమస్యల లక్షణాలలో కనిపిస్తుంది. దీంతో పాటు చెమట, ఇబ్బంది, దడ వంటి లక్షణాలు ఉండి నొప్పి వీపు, మెడ, చెయి, దవడలకు కూడా వ్యాపిస్తుంది. అయితే, దీనిని పరీక్షించే వరకూ ఈ లక్షణాలన్నీ లేకుండా కేవలం ఛాతీ నొప్పి ఉన్నా వదిలేయకుండా వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలని చెబుతున్నారు.

20 నుంచి 25 శాతం

గుండె నొప్పి వచ్చేవారిలో దాదాపు 20 నుంచి 25 శాతం వారికి ఎలాంటి లక్షణాలు లేకుండానే గుండెనొప్పులు వస్తాయి. మరికొంతమందిలో మాత్రం మైకం, తలతిరగడం, వికారం, వాంతుల వంటి లక్షణాలు ఉంటాయి. ఇందులో ఎలాంటి లక్షణాలు ఉన్నా జాగ్రత్తపడాలి.

వీటితో పాటు

గుండెపోటు వచ్చినప్పుడు సాధారణంగా ఎడమవైపు ఛాతీ నొప్పిగా ఉంటుంది. నొప్పి తక్కువగా మొదలై ఎక్కువగా మారుతుంది. దగ్గు, పొత్తికడుపులో నొప్పి, ఇబ్బందిగా అనిపించడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కొన్నిసార్లు ఈ లక్షణాలు ఏం లేకుండానే గుండెనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.

టెస్టులు

గుండె నొప్పి, ఛాతీనొప్పి ఇలా ఏ నొప్పి వచ్చినా ముందుగా ఆలస్యం చేయకుండా దగ్గర్లోని హాస్పిటల్‌‌కి వెళ్ళి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. పేషెంట్స్‌ని పరిశీలించిన డాక్టర్స్ అవసరమనుకుంటే ECG, సీరియల్ కార్డియాక్ మార్కర్స్, 2డి ఎకోకార్డియోగ్రఫీ వంటి టెస్టులు చేస్తారు. అవసరమనుకుంటే ట్రీట్‌మెంట్ చేస్తారు. అయితే, ఛాతీ నొప్పి కామన్ కదా అని కొట్టిపారేయొద్దని చెబుతున్నారు నిపుణులు.

Also Read:  Aloe Vera Benefits: కలబంద లో దాగి ఉన్న రహస్యం