Site icon HashtagU Telugu

Aratikaya Ava Kura: వెరైటీగా ఉండే అరటికాయ ఆవకూర.. ఇలా చేసుకోండి?

Mixcollage 22 Dec 2023 08 41 Pm 282

Mixcollage 22 Dec 2023 08 41 Pm 282

మామూలుగా మనం పండిన అరటిపండ్లను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం. అయితే మార్కెట్లో మనకు పచ్చి అరటిపండ్లు కూడా అమ్ముతూ ఉంటారు. ఈ పచ్చి అరటికాయలను ఉపయోగించి అనేక రకాలు వంటలు కూడా చేస్తూ ఉంటారు. అరటి వేపుడు అరటి మసాలా కూర, అరటికాయ చిప్స్ లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా అరటి ఆవకూర తిన్నారా. వినడానికే వెరైటీగా ఉన్న ఈ రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో అందుకు ఏఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అరటికాయ ఆవకూరకి కావలసిన పదార్దాలు :

అరటికాయలు – 2
పచ్చి మిర్చి – ౩
అల్లం ముక్కలు – కొద్దిగా
చింతపండు రసం – రుచికి సరిపడా
ఉప్పు – 1/2 చెంచాలు
పసుపు – చిటికెడు
ఇంగువ – సరిపడా
పోపుగింజలు – తగినన్ని
నూనె – తగినంత

అరటికాయ ఆవకూర తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా అరటికాయలను తొక్క తీసి ముక్కలుగా చేసి ఉడికించి ప్రక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత మూకుడులో నూనె వేసి తాలింపు దినుసులు వేసి మిర్చి, అల్లం, కరివేపాకు వేసి ఇష్టమైతే ఇంగువ కూడా జోడించి వేయించుకోవాలి. పోపు వేగాక అరటికాయ ముక్కలు వేసి పసుపు, ఉప్పు, చింతపండు రసం జోడించి మూతపెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత కూర బాగా కలిపి ఆవపొడి లేక ఆవముద్ద కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అరటికాయ ఆవకూర రెడీ.