Site icon HashtagU Telugu

Arati Puvvu Curry: ఎప్పుడైన అరటిపువ్వు కర్రీ తిన్నారా.. అయితే ట్రై చేయండిలా?

Arati Puvvu Curry

Arati Puvvu Curry

మామూలుగా మనం పచ్చి అరటికాయతో ఎన్నో రకాల కూరలు తయారు చేస్తూ ఉంటాము. అయితే ఎక్కువ శాతం పచ్చి అరటికాయతో తయారుచేసిన చిప్స్ ని ఎక్కువగా తిని ఉంటారు. చాలామంది ఈ పచ్చి అరటికాయతో రకరకాల కూరలను తయారు చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా కూడా అరటి పువ్వుతో కూరలు చేశారా. మరి అరటి పువ్వుతో కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అరటిపువ్వు కర్రీకి కావాల్సిన పదార్థాలు:

అరటిపువ్వు – 500 గ్రాముల
బంగాళాదుంపలు – 100 గ్రాముల
పసుపు – అర టీస్పూన్
నూనె – రెండున్నర టేబుల్ స్పూన్ల
జీలకర్ర – కొద్దిగా
పచ్చిమిర్చి కారం – కావాల్సినంత
లవంగాలు – 3
అల్లం – అర టీస్పూన్
కొబ్బరి తురుము – 50 గ్రాముల
కారం – పావు టీస్పూన్
జీలకర్ర పొడి – టీస్పూన్
గరం మసాలా – అర టీస్పూన్
పంచదార – కొద్దిగా
నెయ్యి – ఒక టీస్పూన్
ఉప్పు – సరిపడా

అరటిపువ్వు కర్రీ తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా అరటిపువ్వును శుభ్రంగా కడిగి కట్ చేసి ఉప్పు వేసి ఉడికించుకోవాలి. తర్వాత బంగాళాదుంపలు చిన్నచిన్నముక్కలుగా కోసుకుని వేయించుకోవాలి. పాన్ లో నూనె పోసి, అది వేడి అయిన తరువాత జీలకర్ర, లవంగాలు, పచ్చిమిర్చి, కారం, యాలకులు వేసి ఒక నిమిషం వేయించుకోవాలి. ఆ తరువాత అల్లం, కొబ్బరి తురుమును కలపాలి. ఒక నిమిషం తరువాత పొడి మసాలాలన్నీ కలిపీ కొద్దిసేపు వేగనిచ్చి అందులో ఇంతకు ముందు వేయించి పెట్టుకున్న బంగాళదుంపలు, అరటిపువ్వు కలిపి ఉడికించాలి. ఉడికిన తరువాత నెయ్యి వేయాలి. అంతే వేడి వేడి అరటిపువ్వు కూర రెడీ.

Exit mobile version