Site icon HashtagU Telugu

Coffee for skin: కాఫీ పౌడర్ తో మెరిసే చర్మం సొంతం చేసుకోండిలా?

Coffee For Skin

Coffee For Skin

మనం ప్రతిరోజు ఉపయోగించే కాఫీ పౌడర్ కాఫీ కోసం మాత్రమే కాకుండా మన అందాన్ని రెట్టింపు చేయడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అయితే మామూలుగా కొంతమంది స్త్రీలు మాత్రమే ఇలా కాఫీ పౌడర్ ని అందం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. మరి కాఫీ పౌడర్ తో అందాన్ని ఎలా రెట్టింపు చేసుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా మంది కళ్ళు ఉబ్బి ఉంటాయి. అవి చూడ్డానికి అంతగా బాగోవు. ఈ సమస్యను పోగొట్టేందుకు కాఫీ బాగా పనిచేస్తుంది. కాఫీలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సమస్యని తగ్గిస్తుంది. అందుకోసం కాఫీ పౌడర్‌ని గోరువెచ్చని వాటర్‌తో మిక్స్ చేయాలి.

దీనిని కాటన్ బాల్స్‌తో సమస్య ఉన్న చోట రాయండి. ప్రాబ్లమ్ సాల్వ్అదే విధంగా కంటి కింద నల్లని వలయాలు కూడా చాలా మందిని ఇబ్బంది పెడతాయి. అలాంటివారు కూడా కాఫీ పౌడర్‌తో సమస్యని దూరం చేసుకోవచ్చు. ఇందుకోసం అర టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్‌ని 1 టేబుల్ స్పూన్ తేనెతో కలపండి. దీనిని పేస్ట్‌లా చేసి నల్లని వలయాలపై అప్లై చేయండి. దీన్ని 10 నుంచి 15 నిమిషాలు అలానే ఉంచి చల్లని నీటితో కడగండి. ఇది రక్త ప్రసరణని మెరుగుపరిచి నల్లని వలయాలను దూరం చేస్తుంది. కొంతమందికి ఏం చేసినా మొటిమల సమస్య తగ్గదు. అలాంటి వారు కూడా కాఫీ పౌడర్‌తో సమస్యని దూరం చేసుకోవచ్చు. కాఫీలోని యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ నేచురల్ ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది.

ఇందుకోసం కాఫీని తీసుకుని కొద్దిగా నీరు కలిపి మీ స్కిన్‌పై స్క్రబ్‌లా రుద్దాలి. దీంతో డెడ్ స్కిన్ పోయి సమస్య తగ్గుతుంది. అదే కాఫీని ప్యాక్‌లా కూడా వేసుకోవచ్చు. ఇందుకోసం 1 టేబుల్ స్పూన్ శనగపిండి 3 టీ స్పూన్ల కాఫీ కలపండి. అదే విధంగా 3 టీస్పూన్ల తేనె, 2 టీ స్పూన్ల అలోవేరా జెల్, 2, 3 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి ప్యాక్‌లా చేసి రాయండి. 15 నిమిషాల తర్వాత నీటితో క్లీన్ చేయండి. స్కిన్ కోసం కాఫీ కూడా అన్ని ఉపయోగించే ముందు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది

Exit mobile version