మామూలుగా స్త్రీలు అందంగా కనిపించడం కోసం ఏవేవో క్రీమ్స్ వాడుతూ ఉంటారు. ముఖ్యంగా మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రోడక్టులు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వాటి వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు. కొన్ని కొన్ని సార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ను వాడితే అందంగా కనిపించడం సంగతి పక్కన పెడితే చర్మ ఆరోగ్యం కూడా దెబ్బతింటుందట. కానీ కొన్ని ఇంట్లోనే దొరికే వాటిని మీ ముఖానికి అప్లై అందంగా కనిపిస్తారుని, వీటికోసం మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదని చెబుతున్నారు.
ప్రతి ఒక్క మహిళ తన చర్మంపై ఒక్క మచ్చకూడా లేకుండా ఉండాలని కోరుకుంటుంది. అలాగే అందంగా కనిపించాలని కోరుకుంటుంది. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. అందుకే చాలా మంది రకరకాల బ్యూటీ ట్రీట్మెంట్లు కూడా చేయించుకుంటూ ఉంటారు. ఇకపోతే మన ఇంట్లో దొరికే వాటితోనే ముఖాన్ని అందంగా ఎలా మెరిపించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇవి మీ చర్మాన్ని ప్రకాశవంతంగా, మృదువుగా చేస్తాయట. పసుపు, శెనగపిండి రెండింటిలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. ఈ రెండూ అందాన్ని పెంచడానికి కూడా బాగా సహాయపడతాయట. మీ చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలంటే రోజూ స్నానానికి ముందు పసుపు, శెనగపిండిని కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకోవాలట.
అయితే దీనిని ఉపయోగించే ముందు ప్రతి ఒక్కరూ స్కిన్ పై ప్యాచ్ టెస్ట్ ను ఖచ్చితంగా చేయాలట. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవడం వల్ల మీ చర్మం మెరిసేలా చేస్తుందట. కీరదోసకాయ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే ఇది ఒక్క ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందట. ముల్తానీ మట్టి మన ముఖానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ముఖంపై మొటిమలను తగ్గిస్తుందట. అలాగే డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుందట. ఈ సమస్యలు ఉన్నవారు ముల్తానీ మట్టిని ముఖానికి అప్లై చేస్తే ప్రయోజకరంగా ఉంటుందనీ, చెబుతున్నారు. ఇందుకోసం రోజ్ వాటర్ లో 2 చెంచాల ముల్తానీ మిట్టి మిక్స్ చేసి రోజూ స్నానానికి ముందు అప్లై చేయాలట. అయితే పొడి చర్మం ఉన్నవారు ముల్తానీ మిట్టిని ఉపయోగించకపోవడమే మంచిదని చెబుతున్నారు. గంధంలో చర్మాన్ని చల్లబరిచే గుణాలు పుష్కలంగా ఉంటాయట. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల చికాకు, ఎరుపు తగ్గుతాయట.