Site icon HashtagU Telugu

Apple Jam : టేస్టీ ఆపిల్ జామ్ రెసిపీ.. ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో తెలుసా?

Apple Jam Simple Tasty Recipe preparing in Home

Apple Jam Simple Tasty Recipe preparing in Home

ఆపిల్ జామ్(Apple Jam) ను పిల్లలు చపాతీ, పూరీ, బ్రెడ్ వంటి వాటిలో పెట్టుకొని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఆపిల్ జామ్ ను బయట నుండి కాకుండా ఇంటిలో వండుకుంటే ఎంతో మంచిది. ఇంట్లో కూడా సింపుల్ గా తయారు చేయొచ్చు. ఎందుకంటే బయట అమ్మే ఆపిల్ జామ్ లో అది నిలువ ఉండడానికి కెమికల్స్, కలర్ రావడానికి కూడా ఫుడ్ కలర్స్ కలుపుతారు. కాబట్టి మనం ఇంటిలో వండితే రుచికి రుచి మరియు పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది.

యాపిల్ జామ్ తయారీకి కావలసిన పదార్థాలు..

* ఆపిల్స్ నాలుగు
* బీట్ రూట్ ఒకటి చిన్నది
* ఉప్పు కొద్దిగా
* నిమ్మరసం
* షుగర్

యాపిల్ జామ్ తయారు చేయు విధానం..

ఆపిల్ ను తొక్క తీసి ముక్కలుగా కోసి గింజలు తీసేయాలి. బీట్ రూట్ కు కూడా తొక్క తీసి ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒక గిన్నెలో తీసుకొని ఆవిరి మీద ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత ఆ ముక్కలను చల్లార్చి మిక్సి పట్టాలి. మిక్సి లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసిన తరువాత దానిని వడగట్టాలి. ఇప్పుడు మెత్తని పేస్ట్ వస్తుంది. దానిని ఒక గిన్నెలో కొలుచుకోవాలి ఒక కప్పు పేస్ట్ ఉంటె ముప్పావు కప్పు షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ ని ఒక గిన్నెలో తీసుకొని పొయ్యి మీద పెట్టాలి. అందులో షుగర్ వేసి కలబెట్టుకోవాలి. పది నిముషాలు కలబెట్టాక ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇది జామ్ లాగా అయ్యేవరకు ఉడికించుకోవాలి ఇప్పుడే నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. రెండు నిముషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆపిల్ జామ్ రెడీ అయినట్లే.

 

Also Read : Lemon Tea: లెమన్ టీ తాగే అలవాటు లేదా..? అయితే ఈ సమస్యలకు దూరం కానట్టే..!