Steve Jobs Daughter: ఆస్తులు తూచ్.. ఆసక్తికే జై కొట్టిన ఈవ్ జాబ్స్.. ఏం చేస్తోందంటే?

ఇంత పెద్ద కంపెనీని స్థాపించి అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన స్టీవ్ జాబ్స్ విజయం నేటికీ ఎంతోమందికి స్ఫూర్తి.

  • Written By:
  • Publish Date - August 25, 2022 / 08:15 AM IST

A ఫర్ APPLE..

Apple కంపెనీ గురించి తెలియనిది ఎవరికి?

Apple కంపెనీ విలువ రూ.223 లక్షల కోట్లు.

ఇంత పెద్ద కంపెనీని స్థాపించి అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన స్టీవ్ జాబ్స్ విజయం నేటికీ ఎంతోమందికి స్ఫూర్తి. ఆయన 2011 అక్టోబర్ 5న చనిపోయారు. తండ్రి చనిపోయే సమయానికి స్టీవ్ జాబ్స్ చిన్న కూతురు ఈవ్ జాబ్స్ వయసు 12 ఏళ్ళు. ఇప్పుడు ఆమె వయసు 24 ఏళ్ళు.

మేజర్ అయ్యాక .. తండ్రి స్టీవ్ జాబ్స్ వీలునామా రాసిన లక్షల కోట్ల ఆస్తి ఈవ్ జాబ్స్ కు వచ్చింది. ఆమె తలుచుకుంటే ఆ డబ్బులతో విలాసవంతంగా జీవితాంతం బతికేది. తండ్రి వదిలిన యాపిల్ వ్యాపార సామ్రాజ్యంలో ఏదో ఒక విభాగాన్ని చూసుకున్నా.. ఆమె సెట్ అయిపోయేది. కానీ ఈవ్ జాబ్స్ కూడా.. సామాన్యుల పిల్లల్లా రిస్క్ తీసుకుంది. తనకు, తన కుటుంబానికి ఎన్నడూ పరిచయం లేని ఒక కొత్త కెరీర్ “మోడలింగ్” లోకి అడుగు పెట్టింది.

మొదట గ్లోసియర్ ప్లేఫుల్ హాలిడే బ్యూటీ క్యాంపెయిన్‌తో 23 ఏళ్ల ఈవ్ జాబ్స్ తన మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది. ఆమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు.

ఎన్నో ఫ్యాషన్ బ్రాండ్ ల కోసం ప్రచారం చేయడం మొదలుపెట్టింది. బాగా కష్టపడుతూ.. Louis Vuitton అనే ప్రముఖ కంపెనీ కి చెందిన ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. దీనికి సంబంధించిన డీల్ పై సంతకం కూడా చేసింది. భవిష్యత్ లో మోడలింగ్ రంగంలో ఓ మెరుపు మెరవాలనే లక్ష్యంతో ఆమె పనిచేస్తోంది.

ఈవ్ జాబ్స్ కు గుర్రపు స్వారీ కూడా వచ్చు. తండ్రి స్టీవ్ జాబ్స్ ఉండగానే.. ఏటా వేసవి సెలవుల్లో ముద్దుల చిన్న కూతురు ఈవ్ జాబ్స్ ను గుర్రపు స్వారీ ట్రైనింగ్ కు పంపేవారు. అలా ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంది. కేవలం నేర్చుకోవడమే కాదు.. 2020 సంవత్సరం లో జపాన్ లో జరగాల్సిన ఒలింపిక్స్ కోసం అమెరికా టీమ్ తరఫున హార్స్ రైడింగ్ టీమ్ లో ప్రాతినిధ్యం వహించారు. అయితే కరోనా కారణంగా పోటీలు వాయిదా పడ్డాయి. లేదంటే గుర్రపు స్వారీలోనూ అంతర్జాతీయ వేదికపై నిరూపించుకునే అవకాశం ఈవ్ జాబ్స్ కు దక్కేది..

తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తులపైనే ఆశతో బతికే వాళ్ళు..ఆ విధంగా బతకాలని భావించే వాళ్ళు ఈవ్ జాబ్స్ ను చూసైనా మారాలి!!