Site icon HashtagU Telugu

Dandruff: చుండ్రు తగ్గడం కోసం షాంపూలను ఉపయోగిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!

Dandruff

Dandruff

మామూలుగా జుట్టుకు సంబంధించిన సమస్యలు తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటిలో చుండ్రు సమస్య కూడా ఒకటి. చుండ్రు సమస్య కారణంగా చాలా మంది తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. చుండ్రు సమస్య కారణంగా నలుగురికి వెళ్లాలి అన్న కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు.. అలాగే ఈ సమస్య కారణంగా కొన్నిసార్లు హెయిర్ ఫాల్ కూడా అవుతూ ఉంటుంది. చుండు సమస్యను అరికట్టడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ షాంపూలు హీరోయిన్స్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. అయినా కూడా కొన్నిసార్లు మంచి ఫలితాలు కనిపించవు.

కాగా చుండ్రు సమస్యతో బాధపడే వారు షాంపూని ఉపయోగించేవారు కొన్ని రకాల విషయాలను గుర్తుంచు కోవాలని చెబుతున్నారు. యాంటీ డాండ్రఫ్ షాంపులను ఎక్కువకాలం వాడటం జుట్టు ఆరోగ్యానికి అస్సలు మంచిదికాదు అంటున్నారు. దానివల్ల చాలా సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. యాంటీ డాండ్రఫ్ షాంపూల్లో పెట్రోలియం శాతం ఎక్కువగా ఉంటుందట. దీనివల్ల తలపై చర్మానికి హాని కలగవచ్చని చెబుతున్నారు. జుట్టుకు రక్షణగా థిమెథికోన్ పనిచేస్తుంది. పదే పదే యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడితే కచ్చితంగా నెత్తిని డ్రై చేస్తుందట. దీనివల్ల సమస్య మరింత పెరుగుతుందని, జుట్టు పొడిబారడం, రాలడం లాంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.

షాంపూలో ఉండే రెటినాల్, పామిటిక్ ఆమ్లాల ఎస్టర్ తలపై భాగాన్ని ఎరుపు చేసి దురద, పొట్టు రాలేలా చేస్తుందని, స్కాల్ప్ డ్రై అవుతుంటే చుండ్రు నివారణ మరింత ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. అయితే చుండ్రు తగ్గుతున్న కొద్దీ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఆపేయాలట. ఇది కనీసం ఒక నెల. ఆ తర్వాత మీరు ఎప్పుడూ వాడే షాంపూ వాడాలట. ఏడాది పొడవునా యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడితే మీ జుట్టు పలుచబడుతుందట. యాంటీ డాండ్రఫ్ వాడిన తర్వాత సరైన కండీషనర్ వాడాలట. జుట్టును సరిగ్గా డ్రై చేయాలట. ఆ తర్వాత హెయిర్ సీరమ్‌ను తప్పకుండా వాడాలని, ఒకటి రెండు గంటల తర్వాత తప్పకుండా తల దువ్వుకోవాలని చెబుతున్నారు.