Natural Face Pack : ఈ నాలుగు పదార్థాలు కలిపి ఫేస్ ప్యాక్ వేస్తే చాలు.. స్కిన్ మెరిసిపోవాల్సిందే?

మామూలుగా వయసు పెరిగిపోయింది చర్మ సమస్యలు రావడం అనేది సహజం. వయసు మీద పడే కొద్ది ముఖంలో ఎక్కువగా మార్కులు వస్తూ ఉంటాయి. అలాం

Published By: HashtagU Telugu Desk
Natural Face Pack

Natural Face Pack

మామూలుగా వయసు పెరిగిపోయింది చర్మ సమస్యలు రావడం అనేది సహజం. వయసు మీద పడే కొద్ది ముఖంలో ఎక్కువగా మార్కులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు చాలామంది బ్యూటీ ప్రోడక్టులు హోమ్ రెమెడీలను ఫాలో అవుతూ ఉంటారు. అయితే చర్మం మరింత అందంగా మెరిసిపోవాలంటే నాలుగు రకాల పదార్థాలు ం
కలిపి ఫేస్ మాస్క్ వేస్తే సరి. ఎర్ర పప్పు ఇది ఎంత టేస్టీగా ఉంటుందో స్కిన్‌కి కూడా అంత మంచిది. దీనిన వాడడం వల్ల చర్మంపై మచ్చలు తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఎర్రపప్పులో పోషకాలు, విటమిన్లు చర్మ రంగుని మెరుగ్గా చేస్తాయి.

ఈ ఎర్రపప్పుతో ఫేస్‌ప్యాక్స్ తయారు చేయొచ్చు. ఇది మంచి ఎక్స్‌ఫోలియేటర్‌గా కూడా పనిచేస్తుంది. మృతకణాలను పోగొట్టి చర్మాన్ని మెరుగ్గా చేస్తుంది. చర్మ రక్షణలో పసుపు కీ రోల్ పోషిస్తుంది. పసుపుని వాడడం వల్ల హెల్త్, బ్యూటీ బెనిఫిట్స్‌ని అందిస్తాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మానికి ఎంతో మేలు. చర్మ సంరక్షణలో పసుపు అనివార్యమైంది. ఇందులోని కర్కుమిన్ అదనపు మెలనిన్‌ ఉత్పత్తిని తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. కుంకుమపువ్వుని ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. దీనిలోని గొప్ప గుణాలు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని వాడడం వల్ల సహజంగానే గ్లో పెరుగుతుంది. సూర్యకాంతి నుండి వచ్చే సమస్యల్ని దూరం చేస్తుంది.

దీన్ని ఫేస్‌ప్యాక్‌లో యాడ్ చేయడం వల్ల కుంకుమపువ్వులోని కెరోటినాయిడ్స్, క్రోసెటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది చర్మాన్ని తాజాగా, యవ్వనంగా చేస్తాయి. పాలు చర్మానికి వాడడం వల్ల సహజ క్లెన్సర్‌లా పనిచేస్తుంది. పాలలో ఉండే ఉండే అద్భుత గుణాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. చర్మాన్ని క్లీన్ చేసే ప్రోడక్ట్స్‌లో పాలు ఒకటి. పచ్చి పాలని అప్లై చేస్తే చాలా మంచిది. ముందుగా ఎర్రపప్పుని పొడిలా చేసి 2 టీ స్పూన్లు పరిమాణం తీసుకోవాలి. నాలుగైదు చిటికెల కుంకుమ పువ్వు, చిటికెడు పసుపు, పచ్చిపాలు వేసి బాగా కలపండి. దీనిని ఫేస్‌కి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగండి.

  Last Updated: 01 Sep 2023, 05:24 PM IST