Beauty Tips: ‎ముఖంపై మచ్చలు,మడతలు లేకుండా యంగ్ గా కనిపించాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?

‎Beauty Tips: ముఖంపై మచ్చలు ముడతలు లేకుండా చర్మం యవ్వనంగా కనిపించాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలు తీసుకుంటే చాలు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Published By: HashtagU Telugu Desk
Beauty Tips

Beauty Tips

Beauty Tips: ‎ముఖంపై ముడతలు మచ్చలు వంటి సమస్యలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అబ్బాయిలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ అమ్మాయిలు మాత్రం ముడతలు మచ్చలు వంటివి కవర్ చేయడం కోసం మార్కెట్లో దొరికే చాలా రకాల బ్యూటీ ప్రాడక్టులను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ముడతలు మచ్చలు వంటివి ఎక్కువ అయినప్పుడు చిన్న వయసులోనే పెద్ద వయసు వారిలా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలు ఉండకూడదు అంటే మన డైట్ లో కొన్నింటిని చేర్చుకోవాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

‎ఉసిరికాయ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల మన చర్మంలో కొల్లాజెన్ ఆటోమేటిగ్ గా పెరుగుతుందట. ఈ కారణంగా స్కిన్ మెరవడమే కాకుండా ముడతలు కూడా తగ్గుతాయట. దీంతో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి. వీటి కారణంగా దీనిని మనం తీసుకుంటే స్కిన్ బ్రైట్‌ గా మారడమే కాకుండా మొటిమలు, మచ్చల్ని దూరం చేస్తుందట. స్కిన్ లోపలి నుంచి అందంగా కనిపించేందుకు ఉసిరి బాగా హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు. అలాగే దానిమ్మ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో స్కిన్‌bకి కూడా అంతే మేలు చేస్తుందట. స్కిన్‌ పై వచ్చిన సమస్యల్ని నేచురల్‌గానే రిపేర్ చేస్తుందట. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాల కారణంగా స్కిన్ మెరుస్తుందట.

‎ వీటితో పాటు ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా స్కిన్‌పై ఉండే ఏజింగ్ గుణాల్ని దూరం చేస్తాయట. కొల్లాజెన్ ప్రొడక్షన్‌ ని పెంచి వయసు వల్ల వచ్చే సమస్యల్ని దూరం చేస్తాయట. స్కిన్‌ ని హైడ్రేట్ చేస్తుందట. దీని వల్ల స్కిన్ ఇరిటేషన్ తగ్గి యాక్నే దూరమవుతుందట. స్కిన్ బ్రైట్‌ గా ఫీల్ అవుతుందట. స్కిన్‌ పై మచ్చల్ని దూరం చేయడమే కాకుండా సన్‌ డ్యామేజీ కారణంగా స్కిన్ దెబ్బ తినకుండా కాపాడుతుందని చెబుతున్నారు.
‎వాల్‌నట్స్‌ లో కూడా హెల్దీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల స్కిన్ హైడ్రేట్‌ గా ఉంటుందట. అంతేకాకుండా స్కిన్ గ్లో పెరుగుతుందని, వాల్‌నట్స్‌ లోని హైడ్రేటింగ్, యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు స్కిన్‌‌ పై మాయిశ్చరైజేషన్‌ ని దూరం చేయకుండా కాపాడతాయని చెబుతున్నారు.

‎ ఇందులోని ఫ్యాటీ యాసిడ్స్ యాక్నేని దూరం చేస్తాయని, అంతేకాకుండా, ఇందులోని గుణాలు స్కిన్ టోన్‌ని పెంచుతాయని చెబుతున్నారు. ఇన్‌ఫ్లమేషన్‌ ని తగ్గించి స్కిన్‌ ని నేచురల్‌గా ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయట. అదేవిధంగా బాదంలో కూడా విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల స్కిన్ లోపలి నుంచి గ్లో పెరుగుతుందట. ఏజింగ్ సైన్స్‌ని దూరం చేసి స్కిన్‌టోన్‌ ని మెరుగ్గా చేయడానికి ఇందులోని విటమిన్ ఈ, హెల్దీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ హెల్ప్ చేస్తాయట. వీటిని తీసుకోవడం వల్ల స్కిన్ డ్రైగా మారడం తగ్గుతుందని, చర్మంపై ముడతలు, ఫైన్ లైన్స్ తగ్గుతాయని, ఇదో నేచురల్ ఎక్స్‌ఫోలియేటర్‌ లా పనిచేస్తుందని చెబుతున్నారు.

  Last Updated: 08 Dec 2025, 07:30 AM IST