Wife Victim : భార్యా బాధితుల వెతలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యేకించి ఎంతోమంది టెకీలు భార్యా బాధితులుగా మారి అరిగోస అనుభవిస్తున్నారు. భార్యల టార్చర్‌ను తాళలేక.. ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలను ఇటీవలే మనం చూశాం. తాజాగా మరో దారుణమైన వ్యవహారం బయటపడింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ భార్యా బాధితుడు పోలీసు స్టేషనుకు వెళ్లి, కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన బాధేంటో తెలుసుకుందాం..
Also Read :Constable posts : త్వరలో 10,762 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ : హోం మంత్రి అనిత
మాటలు చేష్టలతో టార్చర్
అతడొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ప్రతినెలా మంచి శాలరీ వస్తోంది. 2022లోనే పెళ్లి జరిగింది. ఇక లైఫ్‌లో సెట్ అయినట్టే అని అనుకున్నాడు. భార్యతో కలిసి బెంగళూరులోని సంపిగెహళ్లి ఏరియాలో కాపురం పెట్టాడు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్న అతగాడిని, భార్య(Wife Victim) నిత్యం తన మాటలు చేష్టలతో టార్చర్ చేస్తోంది. ఆఫీసుకు సంబంధించిన జూమ్ కాల్‌లో మాట్లాడుతుండగా.. మధ్యలో వచ్చి భార్య డ్యాన్సులు చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నాడు. తనను అకారణంగా తిట్టడంతో పాటు, ప్రతిరోజు రూ.5వేలు ఇస్తేనే కాపురం చేస్తానని భార్య కండీషన్లు పెడుతోందని సదరు టెకీ పోలీసుల ఎదుట వాపోయాడు. ఈ మేరకు బెంగళూరు సిటీలోని వయ్యాలికావల్ పోలీసు స్టేషనులో కంప్లయింట్ ఇచ్చాడు.
Also Read :Miss World: మిస్ వరల్డ్ పోటీలకు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. అసలు నిజమిదే!
రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్
అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోయినా, చెప్పింది చెప్పినట్లు చేయకపోయినా సూసైడ్ చేసుకుంటానని భార్య బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆ టెకీ చెప్పాడు. విడాకులు తీసుకుంటానని చెబితే.. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నాడు. ‘‘అందం దెబ్బతింటుంది అనే కారణంతో పిల్లలను కనడానికి నా భార్య నిరాకరిస్తోంది. అందుకు బదులుగా పిల్లలను దత్తత తీసుకోవాలని పట్టుబడుతోంది’’ అని ఆ భార్యా బాధితుడు చెప్పాడు. ఇక అతగాడి భార్య వాదన ఇంకోలా ఉంది. తన భర్త మరో పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడని ఆమె అంటోంది. తనపై కావాలనే నిందలు వేస్తున్నాడని చెబుతోంది.