Site icon HashtagU Telugu

Coconut Laddu: ఆంధ్రాస్టైల్ కొబ్బరి లడ్డు రెసిపీ ట్రై చేయండిలా?

Mixcollage 02 Dec 2023 07 15 Pm 5165

Mixcollage 02 Dec 2023 07 15 Pm 5165

మామూలుగా మనం ఎన్నో రకాల లడ్డూలను తినే ఉంటాం. డ్రై ఫ్రూట్ లడ్డు, కొబ్బరి లడ్డు, కాజు లడ్డు, శనగపిండి లడ్డు, బందర్ లడ్డు ఇలా ఎన్నో రకాల లడ్డూలను తినే ఉంటాం. అయితే ఎప్పుడైనా కూడా ఆంధ్ర స్టైల్ కొబ్బరి లడ్డు ట్రై చేశారా. ఎప్పుడు ఈ రెసిపీని తినకపోతే ఈ రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆంధ్రాస్టైల్ కొబ్బరి లడ్డుకి కావాల్సిన పదార్థాలు:

నెయ్యి – 2టేబుల్ స్పూన్లు
తురిమిన కొబ్బరి – 2కప్పులు
బెల్లం – 1.5కప్పు
యాలకుల పొడి – 1/2టేబుల్ స్పూన్
కోవా -1కప్పు
పొడిచక్కెర – 5టేబుల్ స్పూన్స్

ఆంధ్రాస్టైల్ కొబ్బరి లడ్డు తయారీ విధానం:

ఇందుకోస బాణలిలో నెయ్యి వేసి వేడి చేసి అందులో కొబ్బరి, బెల్లం వేయాలి. బెల్లం కరిగే వరకు మీడియం మంట మీద బాగా కలపాలి. అది తడిగా, జిగటగా అయిన తర్వాత అందులో యాలకుల పొడి వేసి చల్లబరచాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని ఒక నిమిషం వేడి చేసి అందులో పంచదార పొడి వేసి జిగురు వచ్చేవరకు కలపాలి. ఒక ప్లేట్ తీసుకుని అందులో ఈ మిశ్రమాన్ని వేయాలి. చిన్న గుండ్రంగా కట్ చేసి, కోవా మిశ్రమాన్ని అందులో వేయాలి. తర్వాత గుండ్రంగా చిన్న చిన్న లడ్డూల మాదిరిగా చేయాలి. వాటిపై మీకు నచ్చితే డ్రైఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవచ్చు. లడ్డూలను కొంత సమయం పాటు ఉంచి, ఆపై వాటిని గాలి చొరబడని కూజాలో నిల్వ చేసుకుంటే సరి. అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్రాస్టైల్ కొబ్బరి లడ్డు రెడీ.

Exit mobile version