Andhra chicken Pulao: ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్రాస్టైల్ స్పైసీ చికెన్ పులావ్.. ట్రై చేయండిలా?

మామూలుగా మనం చికెన్ తో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. చికెన్ కబాబ్, చికెన్ కర్రీ,చికెన్ బిర్యానీ, చికెన్ తందూరి, చికెన్ లెగ్

  • Written By:
  • Publish Date - December 17, 2023 / 05:00 PM IST

మామూలుగా మనం చికెన్ తో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. చికెన్ కబాబ్, చికెన్ కర్రీ,చికెన్ బిర్యానీ, చికెన్ తందూరి, చికెన్ లెగ్ పీస్, చికెన్ 65 లాంటి ఎన్నో రెసిపీలను తయారు చేసుకొని తింటూ ఉంటాం. తెలంగాణ స్టైల్లో చేసుకునే తింటే మరి కొందరు ఆంధ్ర స్టైల్ లో చేసుకుని తింటూ ఉంటారు. అయితే ఎప్పుడైనా ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ పులావ్ తిన్నారా. ఒకవేళ ఎప్పుడు తినకపోతే ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆంధ్రాస్టైల్ స్పైసీ చికెన్ పులావ్ కి కావలసిన పదార్థాలు:

చికెన్ – 1/2కేజీ
బాస్మతి రైస్ – 2కప్స్
చెక్క – చిన్న ముక్క
లవంగాలు – 5-6
యాలకులు – 2
మసాలా మొగ్గ – 1
కరివేపాకు – రెండు రెమ్మలు
ఉల్లిపాయలు – 2
అల్లం – చిన్నముక్క
వెల్లుల్లి పాయలు – 6-10
పచ్చిమిర్చి – 4-6
కారం – 1టీ స్పూన్
పసుపు – 1/2టీ స్పూన్
ధనియాల పొడి – 1టీ స్పూన్
నిమ్మరసం – 1టీ స్పూన్
కొబ్బరి పాలు – 1/2కప్
నూనె – సరిపడా
నెయ్యి – 1టేబుల్ స్పూన్
ఉప్పు – సరిపడా

ఆంధ్రాస్టైల్ స్పైసీ చికెన్ పులావ్ తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా స్టౌ మీద ప్యాన్ పెట్టి వేడయ్యాక అందులో చెక్క, లవంగాలు, యాలకులు, మరాటి మొగ్గ వేసి లైట్ గా వేయించాలి. తర్వాత అందులో కరివేపాకు వేసి ఒక నిముషం అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కులు వేసి మరో ఐదు నిముషాల పాటు మీడియం మంట మీద వేయించాలి. అంతలోపు పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో శుభ్రం చేసుకొన్న చికెన్ ముక్కలను వేసి, ఐదు నిముషాల పాటు వేయించుకోవాలి. తర్వాత అందులోనే పచ్చిమిర్చి పేస్ట్ ను కూడా వేసి బాగా కలియ బెట్టాలి. తర్వాత మూత పెట్టి మంట మీడియంగా పెట్టి మరో పది నిముషాల పాటు ఉడికించుకోవాలి .పది నిముషాల తర్వాత మూత తీసి అందులో కారం, పసుపు చిలకరించి చికెన్ మిశ్రమం బాగా కలపాలి. అలాగే నిమ్మరసం కూడా కలిపి రెండు మూడు నిముషాల పాటు ఉడికించాలి. తర్వాత అందులోనే కొబ్బరి పాలు పోసి, వెంటనే కడిగి పెట్టుకొన్న బాస్మతి రైస్ ను కూడా చేర్చి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి పది-పదిహేను నిముషాల తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అంతే ఆంధ్ర స్టైల్ చికెన్ పులావ్ రెడీ.