Aloe Vera: అలవేరాతో హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుందా.. ఇందులో నిజమెంత?

అలోవేరా.. వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కలబంద అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా ఉపయ

Published By: HashtagU Telugu Desk
Aloe Vera

Aloe Vera

అలోవేరా.. వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కలబంద అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ అలోవేరాను ఎక్కువగా చాలామంది బ్యూటీ కోసమే ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా మొటిమలు తగ్గించుకోవడం కోసం చుండ్రు సమస్యలను తగ్గించుకోవడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా అలోవేరా ను దేనికోసం ఉపయోగిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అప్పుడే తీసిన అలోవేరా గుజ్జు అనేది మార్కెట్లో దొరికే మాయిశ్చరైజర్ కంటే చాలా మంచిది. దీనిని వాడడం వల్ల మీ చర్మంపై వచ్చే దద్దుర్లు, మంట వంటి సమస్యలన్నీ కూడా దూరమవుతాయి.

అలొవేరాని వాడడం వల్ల జుట్టు స్ట్రెయిట్‌గా మారుతుంది. అలోవేరాను చర్మం ఎంతగానో పీల్చుకుంటుంది. దీని వల్ల స్కిన్ సాఫ్ట్, కోమలంగా మారుతుంది. లైట్ జెల్‌లా ఉండే ఈ అలోవేరా అన్ని స్కిన్ టైప్స్‌కి కూడా మంచిది. కానీ, వాడే ముందు కొంత మందికి పడదు. అలాంటప్పడు ప్యాచ్ చేయడం మంచిది. ఎండలో తిరగడం వల్ల చర్మం కమిలిపోతుంది. ఎర్రగా మారుతుంది. ఇలాంటి సమస్యని అలోవేరా దూరం చేస్తుంది. దీనికోసం బయటికి వెళ్ళొచ్చాక ముఖాన్ని క్లీన్ చేసి అలోవేరా జెల్ రాయడం వల్ల సన్‌బర్న్, డార్క్ స్పాట్స్ ఇతర సమస్యలన్నీ దూరమవుతాయి. అలోవేరా వాడడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ మొటిమల సమస్యని దూరం చేస్తుంది.

కొత్తగా వచ్చే మొటిమలు రాకుండా చేస్తుంది. ఎగ్జిమా, సోరియాసిస్, దురద వంటి సమస్యలు ఉన్న అలోవేరా జెల్ రాయడం వల్ల అవి దూరమవుతాయి. అలోవేరాలో యాంటీ మైక్రోబియలన్ లక్షణాలు ఉంటాయి. ఇవి స్కాల్ప్‌ ఇరిటేషన్ వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. దీంతో చుండ్రు కారణంగా వచ్చే ఇబ్బంది పోయి స్కాల్ప్‌ కూడా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతలని దూరం చేస్తుంది అలొవేరా.. స్మైల్ లైన్స్ వంటి వాటిని దూరం చేసి మీ చర్మంలో ఎలాస్టిసిటీని తీసుకొస్తుంది.దీని వల్ల మీరు యవ్వనంగా కనిపిస్తారు..

  Last Updated: 16 Jul 2023, 08:53 PM IST