మామూలుగా స్త్రీ పురుషులు పాదాల పగుళ్ల సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. పురుషులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా ఆ స్త్రీలు ఈ పాదాల పగుళ్ల సమస్యతో ఇబ్బంది పడడంతో పాటు వాటిని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ పాదాల పగుళ్ల సమస్య చాలా మందిని రాత్రి సమయంలో నిద్ర పోయేటప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాళ్లకు దుప్పట్లు వంటివి తగులుకున్నప్పుడు నొప్పి ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అలాగే నడుస్తున్నప్పుడు కూడా ఈ పాదాల పగుళ్ల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
అయితే ఈ పాదాల పగుళ్ల సమస్యలు తగ్గిపోవాలంటే ఇంట్లోనే దొరికే కొన్ని ప్రయత్నిస్తే చాలు పాదాల పగుళ్లు సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలంటే.. ముందుగా ఒక గిన్నెలో అర టీ స్పూన్ పసుపు, అర స్పూన్ కర్పూరం పొడి, అర స్పూన్ నెయ్యి కలుపుకోవాలి. ఈ మూడింటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బకెట్లో గోరు వెచ్చని నీటిని వేసి అందులో షాంపూ వేయాలి. ఆపై అర చెక్క నిమ్మరసం పిండి పాదాలను అందులో ఒక పది నిమషాల పాటు నాననివ్వాలి. తర్వాత ఇంట్లో ఫ్యూమిక్ స్టోన్ తో పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. దీని వల్ల పాదాలపై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి.
తర్వాత శుభ్రంగా తుడిచి తయారు చేసుకున్న కర్పూరం నెయ్యి పసుసు మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేయాలి.ఇది వేటికి అంటుకోకుండా ఉండడానికి సాక్సులు వేసుకోవాలి. ఇలా రాత్రంతా ఉంచి మరుసటి రోజు శుభ్ర పరుచుకోచ్చు. ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు తగ్గుతాయి. ఇందులో వాడే పసుపు వల్ల నొప్పి, వాపు తగ్గిపోతుంది. కర్పూరం కూడా నొప్పిని తగ్గించడంలోనూ, ఇన్ ఫెక్షన్ ని తగ్గించడానికి సహాయపడుతుంది. నెయ్యి తేమను అందించి పాదాల పగుళ్లు తగ్గిస్తుంది. ఈ చిట్కాను కనీసం రెండు మూడు రోజుల పాటు ప్రయత్నిస్తే ఆ మార్పుని మీరే గమనించవచ్చు.