Beauty Tips: దంతాలు తెల్లగా మెరిసిపోవాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే?

మామూలుగా చాలామందికి పళ్ళు తెల్లగా ఉంటే మరి కొంతమందికి పసుపు పచ్చగా, గార పట్టి ఉంటాయి. ఈ పసుపు దంతాల కారణంగా చాలామంది నలుగురిలోకి వెళ్లాలి అ

  • Written By:
  • Publish Date - January 5, 2024 / 06:30 PM IST

మామూలుగా చాలామందికి పళ్ళు తెల్లగా ఉంటే మరి కొంతమందికి పసుపు పచ్చగా, గార పట్టి ఉంటాయి. ఈ పసుపు దంతాల కారణంగా చాలామంది నలుగురిలోకి వెళ్లాలి అన్న మనస్పూర్తిగా నవ్వాలి అన్నా కూడా ఇబ్బందిగా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకొందరికి అయితే పళ్ళు మొత్తం గార పట్టిపోయి చాలా దారుణంగా అంద విహీనంగా కనిపిస్తూ ఉంటాయి. కొందరికి గార పట్టిన పళ్ళ నుంచి దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది. ఈ పళ్ళపై గారను తొలగించుకోవడానికి చాలా మంది రకరకాల టూత్ పేస్ట్ లను ఉపయోగిస్తూ ఉంటారు. అయినా కూడా పళ్ళపై గార తొలగిపోలేదని దిగులు చెందుతూ ఉంటారు.

మీరు కూడా అలా గార పళ్ళతో ఇబ్బంది పడుతున్నారా. అయితే ఇకమీదట అలా బాధ పడాల్సిన అవసరం లేదు. తెల్ల దంతాలు మీ సొంతం కావాలంటే ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు. ఇంతకీ ఆ చిట్కాలు ఏవి అన్న విషయానికి వస్తే.. వంటసోడా పళ్లను తెల్లగా చేస్తుంది. ఇది తేలికపాటి రాపిడి ప్రభావాన్ని కల్గి ఉండి దంతాల మీద మరకలను తొలగిస్తుంది. ఇది టూత్ పౌడర్ లాగా ఉపయోగించవచ్చు. అయితే బేకింగ్ సోడా తీస్కొని దంతాల మీద ఒక నిమిషం పాటు అప్లై చేయాలి. ఆ తర్వాత నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. బేకింగ్ సోడాలో కొంచెం నిమ్మరసం వేసి కలిపి బ్రష్ చేస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే నిమ్మరసం తేలికపాటి బ్లీచింగ్ ప్రభావాన్ని కల్గి ఉంటుంది.

ఇది దంతాలను శుభ్ర పరచడానికి తెల్ల చేయడానికి మాత్రమే కాకుండా శరీరం నుంచి విషాన్ని తొలిగంచడానికి కూడా ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె లేదా ఏదైనా కూరగాయల నూనెతో దీన్ని చేయవచ్చు. ఒక టేబుల్ స్పూన్ నూనెను నోట్లోకి తీస్కొని పుల్లింగ్ చేయండి. దాదాపు 15 నిమిషాల పాటు ఇలా చేయాలి. దీంతో నూనె లాలాజలంతో కలస్తుంది. ఇది స్విర్లింగ్ ఎంజైమ్ లను సక్రియం చేస్తుంది. ఆ తర్వాత ఇది దంతాల మధ్య రక్త ప్రవాహాన్ని మెరుగుపర్చి విషాన్ని బయటకు పంపుతుంది. అనంతరం నూనెను ఉమ్మివేయాలి. నారింజ పండు తొక్క తీసి కింద భాగం అంటే తెల్లటి బాగాన్ని దంతాల మీద రుద్దడం వల్ల దంతాలు తెల్లగా అవుతాయి. ఇందులో ఉండే డి-లిమోనెన్ వల్ల పళ్లు మిలమిలా మెరుస్తాయి. తొక్క తెల్లటి భాగంలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి, ఆపై దంతాల అప్లై చేయాలి.

అలాగే పసుపు కూడా తేలికపాటి బ్లీచింగ్ ప్రభావాన్ని కల్గి ఉంటుంది. ఇది సహజ క్రిమినాశని కావున దంతాలు చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. పసుపు ద్వారా పేస్టు కూడా తయారు చేసుకోవచ్చు. ఒక టీ స్పూన్ పసుపులో కొబ్బరి నూనె, బేకిండ్ సోడా అర టీ స్పూన్ కలిపి టూత్ పేస్టులా తయారు చేసుకోవచ్చు. అలాగే కలబంద అనేక సమస్యలకు ఔషధంలా పని చేస్తుంది. ఇది దంతాలను తెల్లగా మారుస్తుంది. ఇది దంతాల మీద పసుపు రంగు మరకలను తొలగించడంలో సహాయ పడుతుంది.