Hair Tips: తెల్ల వెంట్రుకలు క్షణాల్లో నల్లగా మారాలంటే ఇంట్లో తయారు చేసుకునే ఈ హెయిర్ కలర్ వాడితే చాలు?

ఈ రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అయితే రాను రాను ఈ తెల్ల జుట్టు సమస్య చిన్నపిల్లల

  • Written By:
  • Publish Date - January 9, 2024 / 03:30 PM IST

ఈ రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అయితే రాను రాను ఈ తెల్ల జుట్టు సమస్య చిన్నపిల్లల నుంచే మొదలవుతోంది. ఇక యుక్త వయసు వారికి ఇలా చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడి ముసలి వారిలో కనిపించడంతో నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇందుకు గల ప్రధానం కారణం మనం తినే ఆహార పదార్థాలే అని చెప్పవచ్చు. అయితే ఈ తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడటం కోసం చాలామంది మార్కెట్ లో దొరికే రకరకాల కలర్స్ అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు.

అయినా కూడా ఫలితం రాలేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే తెల్ల జుట్టు నల్లగా మారాలి అంటే ఇంట్లోనే తయారు చేసే ఈ కలర్ ఉపయోగించాల్సిందే. మరి అందుకోసం ఏమి చెయ్యాలి అన్న విషయానికి వస్తే.. ఇందుకోసం ఒక ఐరన్ పాన్ ని తీసుకొని దానిలో 2 స్పూన్ల ఉసిరి పొడి వేసుకోవాలి. అందులోనే 2 స్పూన్ల గుంటగలగ రాకు పొడి వేసుకోవాలి. దీనినే బ్రింగరాజ్ అని కూడా అంటారు. ఇందులో ఒక స్పూన్ స్వచ్ఛమైన పసుపు వేసుకోవాలి. వీటన్నింటిని నల్లగా మారేంత వరకు వేయిస్తూ ఉండాలి. ఉసిరి పొడి జుట్టు పొడవుగా నల్లగా ఉండేందుకు సహాయ పడుతుంది. ఉసిరి పొడిలో ఉండే విటామిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు పొడవుగా పెరిగేందుకు, పగిలిపోకుండా, మెరుస్తూ ఉండేందుకు సహాయ పడుతుంది.

అలాగే గుంటగలగరాకు కూడా జుట్టు పెరుగుదలకు జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సహాయ పడుతుంది. గుంటగలగరాకు తయారు చేసే నూనె జుట్టు పెరుగుదలకు సహాయ పడుతుంది. అయితే పసుపు తలలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లేకుండా జుట్టు రాలిపోకుండా అడ్డుకుంటుంది. ఇప్పుడు అవన్నీ బాగా మాడి నల్లగా పొడి తయారు అయిన తర్వాత దీన్ని చల్లార్చుకోవాలి. ఈ పొడిని ఒకగాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. దీన్ని ఎక్కడైతే జుట్టుకు అప్లై చేసుకోవాలి. జుట్టుకు పెట్టుకోవాలన్నప్పుడు కావలిసినంత మోతాదులో పొడిని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి.

దానితో అది తలకు అప్లై చేసుకునే విధంగా ఉండేలా కొబ్బరి నూనె లేదా ఆవ నూనెతో కలుపుకోవాలి. కలిపిన తర్వాత తలకు అప్లై చేయండి. జుట్టు అలాగే ఉంది అలానే తల దువ్వుకొని జుట్టుని వదిలేయవచ్చు. తన స్నానం చేయవలసిన అవసరం లేదు. ఈ ప్యాక్ జుట్టుకు సంరక్షించడంలో మనకు ఎంతగానో సహాయపడుతుంది. జుట్టుకు కావాల్సిన తేమ, పోషణ అందిస్సతూ జుట్టు కుదుళ్లు బలంగా చేస్తుంది. జుట్టుకు మంచి నలుపు రంగు జుట్టు అందించి తెల్ల జుట్టు సమస్యను నివారిస్తుంది. అయితే దీన్ని ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యం చాలా మెరుగవుతుంది.