మన వంటింట్లో విరివిగా దొరికే వాటిలో అల్లం కూడా ఒకటి. అల్లం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం తెలిసిందే. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజు ఒక కప్పు అల్లం టీని తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు అల్లం టీని తేనెతో కలిపి తాగడం వల్ల ఆస్తమా దగ్గు లాంటి వాటికి చెక్ పెట్టవచ్చు. అల్లం టీ తాగడం వల్ల ఆ రక్తప్రసరణ సరిగా జరుగి నియంత్రణలో ఉంటుంది. అదేవిధంగా అల్లం లో ఉండే ఖనిజలవణాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి.
అల్లం టీ హృదయ కవాటాల్లో రక్త సరఫరా సక్రమంగా ఉండటానికి దోహదపడతాయి. హృద్రోగాలూ దూరంగా ఉంటాయి. నెలసరి సమస్యలు కూడా అదుపులోకి వస్తాయి. అల్లం టీ తాగడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికశాతం అందడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరిగి, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం టీని ఉదయాన్నే తాగడం వల్ల ఆ రోజంతా హుషారుగా ఉంటారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు అల్లం టీలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.
అదేవిధంగా ఎక్కిళ్ళు వచ్చేవారు అల్లం టీని తాగడం వల్ల వాటిని ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా అల్లం టీ తాగడం వల్ల ఛాతిలో మంట, అజిర్ణం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే అల్లం టీని సేవించడం ద్వారా మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు ఉండవు. అల్లం టీ రోజూ తీసుకుంటే మోకాళ్ళ వాపులు తగ్గిపోతాయి.