Soap Nuts: నల్లగా నిగనిగలాడే జుట్టు కావాలంటే కుంకుడుకాయలతో ఇలా చేయాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో అంటే టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి షాంపూలు,సోపులు, హెయిర్ ఆయిల్స్ వచ్చాయి కానీ, ఇదివరకటి రోజుల్లో అనగా మన అమ్మమ్మ తాతయ్యల కా

Published By: HashtagU Telugu Desk
Mixcollage 09 Dec 2023 01 38 Pm 6788

Mixcollage 09 Dec 2023 01 38 Pm 6788

ప్రస్తుత రోజుల్లో అంటే టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి షాంపూలు,సోపులు, హెయిర్ ఆయిల్స్ వచ్చాయి కానీ, ఇదివరకటి రోజుల్లో అనగా మన అమ్మమ్మ తాతయ్యల కాలంలో కుంకుడు కాయలతోనే తల స్నానాలు చేసేవారు. సినిమాలు సీరియల్స్ లో కూడా కొన్ని కొన్ని సన్నివేశాలలో ఈ కుంకుడుకాయతో తల స్నానాలు చేయించడం లాంటివి చూపిస్తూ ఉంటారు. కానీ కుంకుడుకాయ తలస్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలామందికి తెలియదు. అయితే కుంకుడ కాయ తల, జుట్టు శుభ్రం చేయడమే కాదు జుట్టుకు పోషణ అందిస్తుంది. మరి కుంకుడు కాయతో తలస్నానం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కుంకుడు కాయలలో న్యాచురల్‌ సపోనిన్‌లు ఉంటాయి. ఇవి న్యాచురల్‌ క్లెన్సర్స్‌.

ఇవి తల, జుట్టులోని నూనెలను తొలగించకుండా జుట్టును సున్నితంగా శభ్రపరుస్తాయి. కుంకుడు కాయలు సున్నితమైన జుట్టు, డ్రైహెయిర్‌ ఇలా ఎలాంటి జుట్టు ఉన్నా పర్షెక్ట్‌గా సరిపోతాయి. షాంపూలలో ఉండే సల్ఫేట్‌లు, పారాబెన్‌లు, సిలికాన్‌ల వంటి కఠినమైన రసాయనాలు కుంకుడు కాయలలో ఉండవు. కుంకుడు కాయలలో హానికరమైన పదార్థాలు ఉండవు. ఇవి తలస్నానానికి బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పవచ్చు. షాంపూలలో ఉండే సల్ఫేట్‌లు, పారాబెన్‌లు, సిలికాన్‌ల వంటి కఠినమైన రసాయనాలు కుంకుడు కాయలలో ఉండవు. కుంకుడు కాయలలో హానికరమైన పదార్థాలు ఉండవు. ఇవి తలస్నానానికి బెస్ట్‌ ఆప్షన్‌.

కుంకుడు కాయలలో యాంటీ మైక్రోబయల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి చుండ్రు, దురద, స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్‌ల నుంచి రక్షిస్తాయి. ఇవి మీ తలను ఆరోగ్యాంగా ఉంచుతాయి. శుభ్రమైన, ఆరోగ్యకరమైన తల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.​ కుంకుడు కాయలలో విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, డి ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు పోషణ అందించి దృఢంగా మారుస్తాయి. జుట్టు చిట్లడం, చివర్లు చీలిపోవడాన్ని నివారిస్తాయి. మీరు తరచు కుంకుడు కాయతో తలస్నానం చేస్తే.. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.
మీ జుట్టు నిస్తేజంగా, నిర్జీవంగా మారితే, కుంకుడు కాయలు సహాయపడతాయి. కుంకుడు కాయతో తలస్నానం చేస్తే మీ జుట్టుకు మెరుపును అందిస్తాయి. ఇది జుట్టులోని సహజ నూనెలను తొలగించదు. మీ జుట్టు మెరిసేలా, ఆరోగ్యంగా ఉంచుతుంది.​

  Last Updated: 09 Dec 2023, 01:38 PM IST