Site icon HashtagU Telugu

Soap Nuts: కుంకుడుకాయతో తల స్నానం చేస్తే చాలు.. జుట్టు పెరగడంతో పాటు?

Soap Nuts

Soap Nuts

కుంకుడుకాయల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి మనందరికీ తెలిసిందే. పూర్వం రోజులో మన పెద్దలు ఎంచక్కా కుంకుడు కాయలతో స్నానం చేయించేవారు. కానీ రాను రాను వీటి ఉపయోగం చాలా వరకు తగ్గిపోయింది. అయితే ప్రస్తుత రోజుల్లో వీటిని నేరుగా ఉపయోగించడానికి బదులుగా వీటితో తయారు చేసిన షాంపూలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే కుంకుడకాయ తల, జుట్టు శుభ్రం చేయడం మాత్రమే కాకుండా జుట్టుకు పోషణ కూడా అందిస్తుంది. మరి కుంకుడుకాయతో తల స్నానం చేయడం వల్ల ఇంకా ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కుంకుడు కాయలలో న్యాచురల్‌ సపోనిన్‌లు ఉంటాయి. ఇవి న్యాచురల్‌ క్లెన్సర్స్‌. ఇవి తల, జుట్టులోని నూనెలను తొలగించకుండా జుట్టును సున్నితంగా శభ్రపరుస్తాయి. కుంకుడు కాయలు సున్నితమైన జుట్టు, డ్రైహెయిర్‌ ఇలా ఎలాంటి జుట్టు ఉన్నా పర్షెక్ట్‌గా సరిపోతాయి.​ షాంపూలలో ఉండే సల్ఫేట్‌లు, పారాబెన్‌లు, సిలికాన్‌ల వంటి కఠినమైన రసాయనాలు కుంకుడు కాయలలో ఉండవు. కుంకుడు కాయలలో హానికరమైన పదార్థాలు ఉండవు. ఇవి తలస్నానానికి బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పచ్చు. కుంకుడుకాయలలో యాంటీ మైక్రోబయల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి చుండ్రు, దురద, స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్‌ల నుంచి రక్షిస్తాయి. అలాగే ఇవి మీ తలను ఆరోగ్యాంగా ఉంచుతాయి. శుభ్రమైన, ఆరోగ్యకరమైన తల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.​ కుంకుడు కాయలలో విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి.

దీనిలో విటమిన్ ఏ, డి ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు పోషణ అందించి దృఢంగా మారుస్తాయి. జుట్టు చిట్లడం, చివర్లు చీలిపోవడాన్ని నివారిస్తాయి. మీరు తరచు కుంకుడు కాయతో తలస్నానం చేస్తే.. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. మీ జుట్టు నిస్తేజంగా, నిర్జీవంగా మారితే, కుంకుడు కాయలు సహాయపడతాయి. కుంకుడు కాయతో తలస్నానం చేస్తే మీ జుట్టుకు మెరుపును అందిస్తాయి. ఇది జుట్టులోని సహజ నూనెలను తొలగించదు. మీ జుట్టు మెరిసేలా, ఆరోగ్యంగా ఉంచుతుంది.​ స్కాల్ప్ మీద ఫంగస్ పెరగడం వల్ల చుండ్రు సమస్య వస్తుంది. కుంకుడు కాయలు స్కాల్ప్‌ని పూర్తిగా శుభ్రపరుస్తాయి. దాంతో స్కాల్ప్ మీద ఫంగస్‌ పెరగది. తరచు కుంకుడుకాయలతోనే తలస్నానం చేస్తూ ఉంటే చుండ్రు సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది.

Exit mobile version