Dragon Fruit for Beauty: డ్రాగన్ ఫ్రూట్ తో ఇలా చేస్తే చాలు అందమైన మెరిసే చర్మం మీ సొంతం!

డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండుని చిన్నపిల్లల

  • Written By:
  • Publish Date - March 20, 2024 / 07:35 PM IST

డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండుని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడి తింటూ ఉంటారు. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌, విటమిన్‌ సి, విటమిన్‌ బి1, బి2, బి3 వంటి పోషకాలు ఉంటాయి. డ్రాగన్‌ ఫ్రూట్‌ సౌందర్య సంరక్షణకూ సహాయపడుతుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది..

మరి డ్రాగన్ ఫ్రూట్ తో మీ అందాన్ని ఎలా రెట్టింపు చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. డ్రాగన్‌ ఫ్రూట్‌లోని సహజ చక్కెరలు, హైడ్రేటింగ్ సమ్మేళనాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. ఇవి చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతాయి. డ్రాగన్ ఫ్రూట్‌లోని అధిక నీటి కంటెంట్ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. డ్రాగన్‌ ఫ్రూట్‌లో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఫ్రీరాడికల్స్‌ వల్ల కలిగే నష్టం నుంచి చర్మ కణాలను రక్షిస్తాయి. ఇది వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది, మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది. డ్రాగన్‌ ఫ్రూట్‌లోని విటమిన్‌ సి కంటెంట్‌ డార్క్‌ స్పాట్స్‌, అనిఇవెన్‌ స్కిన్‌ టోన్‌ రూపాన్ని తగ్గించి ప్రకాశవంతమైన ఛాయను అందిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.

డ్రాగన్‌ ఫ్రూట్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చికాకు కలిగించే చర్మం నుంచి ఉపశమనం ఇస్తాయి. సెన్సిటివ్‌ స్కిన్‌ ఉన్నవారికి డ్రగాన్‌ ఫ్రూట్‌ తోడ్పడుతుంది. డ్రాగన్‌ ఫ్రూట్‌లోని యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు మొటిమలను తగ్గించడానికి సహాయపడతాయి. చర్మం ఉపరితలంపై బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడానికి తోడ్పడతాయి.కొల్లాజెన్‌ ఉత్పత్తికి విటమిన్‌ సి అవసరం, ఇది చర్మం స్థితిస్థాపకత, దృఢత్వానికి దోహదపడే ప్రొటీన్‌. మీ స్కిన్‌ కేర్‌లో డ్రాగన్‌ ఫ్రూట్‌ తరచు యాడ్‌ చేసుకుంటేకొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌లోని విత్తనాలు సున్నితమైన ఎక్స్‌ఫోలియేటర్‌లుగా పనిచేస్తాయి. ఇవి చర్మంపై పేరుకున్న మృత కణాలను తొలగించి, మృదువైన ఛాయను ప్రోత్సహించడానికి తోడ్పడతాయి. కాగా ఇందుకోసం బాగా పండిన డ్రాగన్‌ ప్రూట్‌ను తీసుకోవాలి. డ్రాగన్‌ ఫ్రూట్‌ గుజ్జును మెత్తగా చేసి ఈ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌లా వేయాలి. దీన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రమైన టవల్‌తో తుడుచుకోవాలి. ఆ తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకోవాలి. అంతే తరచూ ఇలా చేస్తే అందమైన మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.