Site icon HashtagU Telugu

Ghee: ముఖానికి నెయ్యి రాసుకోవచ్చా.. రాసుకుంటే ఏమవుతుంది.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Ghee

Ghee

నెయ్యి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నెయ్యి తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే నెయ్యి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందట. మన ముఖాన్ని మెరిసేలా చేయడంలో నెయ్యి చాలా బాగా ఉపయోగపడుతుందట. మరి ముఖానికి నెయ్యి ఏ విధంగా ఉపయోగపడుతుంది.

ఇంతకీ నెయ్యిని ముఖానికి అప్లై చేయవచ్చా చేయకూడదా? ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నెయ్యిని ప్రతిరోజు ముఖానికి మాయిశ్చరైజర్ లాగా రాసుకోవడం వల్ల మీ ముఖం చాలా మృదువుగా మారుతుందట. నెయ్యిలో ఉండే న్యూట్రియంట్స్ మన చర్మాన్ని చాలా మృదువుగా మార్చడానికి సహాయపడతాయని,వాటితో పాటు ముఖంపై వచ్చే బ్లాక్ హెడ్స్ తొలగించడానికీ, మొటిమల సమస్య తగ్గించడానికి, వయసు రిత్యా వచ్చే గీతలు కూడా పోతాయని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల వయసు తగ్గి ఎక్కువ కాలం యవ్వనంగా కనపడతారట.

అదేవిధంగా నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి తెలియని ఒక గ్లోని తీసుకువస్తాయట. చర్మం అందంగా మారడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. వయసు పెరిగే ముఖంపై ముడతలు రావడం అన్నది సహజం. ఆ ముడతలను తొలగించడం కోసం తరచుగా ముఖానికి నెయ్యిని రాయడం వల్ల ముఖానికి గ్లో తేవడం మాత్రమే కాకుండా ముఖంపై ముడతలు కూడా మాయమవుతాయట. కాలంతో సంబంధం లేకుండా చాలా మందికి డ్రై స్కిన్ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటి వారు ముఖానికి నెయ్యి రాయడం వల్ల డ్రై స్కిన్ సమస్య తగ్గుతుందట. చర్మం కూడా మంచిగా మాయిశ్చరైజ్డ్ గా మారుతుందని, మృదువుగా ఉంటుందని చెబుతున్నారు.

Exit mobile version