carrot benefits for skin: కాంతివంతమైన చర్మం మీ సొంతం కావాలంటే క్యారెట్ తో ఈ ప్యాక్ ట్రై చేయాల్సిందే?

  • Written By:
  • Updated On - February 17, 2024 / 09:07 PM IST

క్యారెట్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా కంటి చూపుకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఎ, కె, బి6 విటమిన్లు, బయోటిన్‌, మినరల్స్‌, బీటా కెరొటిన్‌ గుణాలెక్కువ. క్యారెట్‌ తీసుకుంటే డయాబెటిస్‌ ముప్పు తగ్గుతుంది. దీనిలో ఉండే ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. క్యారెట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం గుండె, మెదడు, మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచివి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. క్యారెట్‌లోని పోషకాలు ఆరోగ్యానికే కాదు. అందాన్ని రెట్టింపు చేయడానికి సహాయపడతాయి. క్యారెట్‌ మన ఆహారం తీసుకున్నా, ఎక్స్‌టర్నల్‌గా అప్లై చేసినా అనేక సౌందర్య ప్రయోజనాలు పొందవచ్చు.

అయితే క్యారెట్ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి క్యారెట్ తో మన అందాన్ని ఏ విధంగా పెంచుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. క్యారెట్ ఫేస్ మాస్క్ మెరిసే మచ్చలేని చర్మాన్ని అందిస్తుంది. ఇది డెడ్‌ సెల్స్‌ను తొలగించి..చర్మానికి కాంతిని ఇస్తుంది. క్యారెట్‌లోని విటమిన్ ఎ చర్మంలోని అధిక నూనెను బయటకు పంపి తాజాగా, టాక్సిన్స్‌ లేకుండా ఉంచుతుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి క్యారెట్‌ బెస్ట్‌ ఆప్షన్‌. క్యారెట్‌ చర్మాన్ని హైడ్రేట్‌ చేస్తుంది, ఛాయను మెరుగుపరుస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా నుంచి కూడా రక్షిస్తుంది. క్యారెట్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మన చర్మం పొరల్లోకి వెళ్లి పొడిబారకుండా కాపాడుతుంది.

క్యారెట్‌ మాస్క్‌ చర్మానికి లోతుగా తేమను అందించి, మెరిసేలా చేస్తుంది. క్యారెట్‌లో ఉండే బీటా కెరోటిన్, కెరోటినాయిడ్స్ UVA కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి, సన్ టాన్‌ను కూడా తొలగిస్తాయి. క్యారెట్లలోని విటమిన్లు, మినరల్స్‌.. కంటి కింద తేమను రక్షిస్తాయి. చర్మం రంగును మెరుగుపరుస్తాయి. క్యారెట్‌ ప్యాక్‌ వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా కాపాడుతుంది. క్యారెట్‌లోని బీటా-కెరోటిన్‌ చర్మం ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రోసేసియా, తామర, సోరియాసిస్, దద్దుర్లు, మొటిమల సమస్యలు ఉన్నవారికి గొప్పగా పనిచేస్తుంది. దీనిలో ఉండే కెరొటినాయిడ్స్‌, బయోయాక్టివ్‌ ఫ్లెవనాయిడ్లు కణాల ఆరోగ్యానికి చాలామంచిది. విటమిన్‌ ఎ కణాలు, కొలాజెన్‌ ఉత్పత్తికీ సాయపడుతుంది.

మన చర్మాన్ని ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షించడానికి.. క్యారెట్‌లోని విటమిన్‌ సీ, యాంటీఆక్సిడెంట్లు సహాయపడతాయి. ఇది దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేయడంలోనూ తోడ్పడుతుంది. క్యారట్- 1, పచ్చిపాలు- 1 టేబుల్ స్పూన్, తేనె- 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. క్యారట్‌ ని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి ఉడికించుకొని, అవి చల్లారక పేస్ట్‌లా చేయాలి. దీనిలో పచ్చిపాలు, తేనె వేసి కలిపాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని అరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖ చర్మానికి తేమ అందడంతో పాటు, పాలు చర్మంలో పేరుకుపోయిన మురికిని తొలగించి మచ్చలు లేకుండా చేస్తాయి.