Coconut Oil: కొబ్బరి నూనెతో ఇలా చేస్తే చాలు అందమైన మృదువైన చర్మం మీ సొంతం?

కొబ్బరి నూనె వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా అందానికి కొబ్బరి నూనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది

  • Written By:
  • Publish Date - January 17, 2024 / 05:30 PM IST

కొబ్బరి నూనె వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా అందానికి కొబ్బరి నూనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది. జుట్టు సంరక్షణ కోసం కూడా కొబ్బరి నూనె సహాయపడుతుంది. దీనిలోని యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ చర్మ సమస్యల నుంచి రక్షిస్తాయి. దీనిలోని మాయిశ్చరైజింగ్‌ గుణాలు, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు హానికరమైన కారకాల నుంచి చర్మాన్ని కాపాడతాయి. మీకు తెలుసా కొబ్బరి నూనెతో కేవలం జుట్టుకు సంబంధించిన సమస్యలు మాత్రమే కాకుండా చర్మానికి సంబంధించిన సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొబ్బరి నూనెలో యాంటీ మైక్రోబయల్‌ గుణాలు ఉంటాయి. దీనిలోని లారిక్ యాసిడ్‌, క్యాప్రిలిక్ యాసిడ్ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్‌, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, ఫంగస్‌ వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. మొటిమలు, తామర, సోరియాసిస్, స్కిన్‌ ఇన్ఫెక్షన్ల నుంచి కొబ్బరి నూనె రక్షిస్తుంది. కొబ్బరి నూనె చర్మానికి తేమను అందిస్తుంది. ఇది పొడి చర్మం, చికాకు నుంచి ఉపశమనం ఇస్తుంది. కొబ్బరి నూనెలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, యాంటీ మైక్రోబయల్ గుణాలు మంటను తగ్గించడానికి, చర్మానికి పోషణ అందించడానికి సహాయపడతాయి. కణాలలోకి తేమను లోతుగా నడిపించే దాని సామర్థ్యం మీ చర్మాన్ని హైడ్రేట్‌‌గా, మృదువుగా ఉంచడానికి సహాయపడతాయి.

కొబ్బరి నూనెలో విటమిన్ ఇ, క్యాప్రిక్ యాసిడ్, లినోలెయిక్ యాసిడ్, క్యాప్రిలిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి చర్మానికి పోషణ అందిస్తాయి. కొబ్బరి నూనెలోని మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ చర్యను కలిగిస్తాయి. MCTలు సన్‌ బర్న్‌ల వల్ల కలిగే ఎరుపును తగ్గించడానికి సహాయపడతాయి. వీటిలోని యాంటీవైరల్, యాంటీ ఫంగల్‌, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇన్‌ఫెక్షన్ల చికిత్సకు సహాయపడతాయి. కొబ్బరి నూనెలో లారిక్‌ యాసిడ్‌ ఉంటుంది. దీనిలో శక్తివంతమైన యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబయల్‌ గుణాలు ఉంటాయి. ఈ లక్షణాలు మొటిమలతో సంబంధం ఉన్న ఎరుపు, వాపును తగ్గించడానికి సహాయపడతాయి. బ్రేకవుట్‌లకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతాయి. కొబ్బరి నూనె చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దుమ్మ కణాలు, కాలుష్యం నుంచి ఇది చర్మాన్ని రక్షిస్తుంది. కొబ్బరి నూనెలోని MCT ఫ్యాటీ యాసిడ్స్‌ యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.

చిన్నవయస్సులోనే ముడతలు, వయస్సు మచ్చలు, ఫైన్‌ లైన్స్‌ వంటి వృద్ధాప లక్షణాలు రాకుండా అడ్డకుంటాయి. విటమిన్ ఈ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది మీరు ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. కొబ్బరి నూనె అప్లై చేసే ముందు, మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖం ఆరిన తర్వాత కొంచెం కొబ్బరి నూనె తీసుకుని అప్లై చేయాలి. ఆ తర్వాత సున్నితంగా మసాజ్‌ చేసి, కొంచెం సేపు ఆరనిచ్చి ఆ తర్వాత మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వత మెత్తటి టవల్‌తో తుడవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకోవాలి.